క్రీడాభూమి

చివరి వనే్డలోనూ భారత్ జయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, అక్టోబర్ 14: దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతున్న చివరి వనే్డలో మిథాలీ సేన 6 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిం డియా 146 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ (38), శిఖా పాండే (35) మాత్రమే రాణిం చారు. సఫారీ బౌలర్లలో మరిజినె్న కాప్ 3 వికెట్లు పడగొట్ట గా, షబ్నం ఇస్మాయల్, యాబొంగఖాక రెండేసి వికెట్లు, టుమి సిఖుఖునె, షంగేస్, లూస్ తలో వికెట్ తీశారు. అ నంతరం స్పల్ప లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 140 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ మూ డు వికెట్లు తీయగా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ రెండో వికె ట్లు పడగొట్టారు. మన్సీ జోషీ, హర్మన్‌ప్రీత్ కౌర్ జెమీమా రోడ్రిగ్స్ తలా వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ మూడు వనే్డల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.