క్రీడాభూమి

టైగర్ ఈజ్ బ్యాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో తన నామినేషన్ పత్రాలను సమర్పించాడు. గంగూలీ నామినేషన్ సందర్భంగా అతడి వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్. శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. దాదాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీసీసీఐ కోశాధికారిగా అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ నామినేషన్ వేశారు. అక్టోబర్ 23న ఎన్నికలు జరగనున్నాయ. బీసీసీఐ అధ్య క్ష పదవికి నామినేషన్లకు సోమవారం చివరిరోజు కావడంతో గంగూలీ తప్ప మరెవరూ నామినేషన్ వేయలేదు.
ఎన్నిక లాంఛనమే..
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక లాంఛనం కానుంది. శనివారం ఢిల్లీలో గంగూలీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడంతో అధ్యక్షుడు ఖాయమనే వార్తలొచ్చాయ. అయతే 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అమిత్ షా కోరగా, గంగూలీ అందుకు ఎలాంటి హామీ ఇవ్వలే దని తెలిసింది. గంగూలీతో పాటు అధ్యక్ష పదవికి మాజీ అధ్య క్షుడు శ్రీనివాస్ వర్గానికి చెందిన బ్రిజేష్ పటేల్ పేరు తెరపైకి వచ్చింది. అతడి అభ్యర్థిత్వాన్ని చాలా సంఘాలు వ్యతిరేకిం చడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. బీసీసీఐకి నూతన అధ్యక్షుడు ఎన్నికతో సుప్రీం కోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (సీఓఏ) 33 నెలల పాలన ముగియనుంది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు ప్రాధాన్యం..
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ రూల్ అదే. ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు ప్రాధాన్యత. దానిపైనే ప్రధానంగా దృష్టి సారి స్తానని పేర్కొన్నాడు. నా తొలి ప్రాముఖ్యత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కే. ఇదే విషయాన్ని సీఓఏ విజ్ఞప్తి చేశా. కానీ వారు పట్టిచుకోలేదు. రంజీ ట్రోఫీ క్రికెట్‌పై ఫోకస్ ఉంటుంది. ఆర్థిక ఆసక్తి ఉన్న క్రికెట ర్లు జాగ్రత్త గా ఉండాలని సూచించాడు. అలాగే తనును ఏకగ్రీ వంగా అధ్యక్షుడిగా చేయడానికి బీసీసీఐ మెజారిటీ రాష్ట్ర యూ నిట్లు మద్దతు తెలపడంపై హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ సంస్థ అయన బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్య తలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉండడమే కాకుండా, సంతో షంగా ఉందని పేర్కొన్నాడు. ఇదిలాఉంటే 65 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా ఓ మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన ట్లయంది. గతంలో విజయనగరా నికి చెందిన ఏకేఏ విజ్జి 1954-56 మధ్య కాలంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశాడు. మధ్యలో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్‌లు కూ డా తాత్కాలికి అధ్యక్షులుగా పనిచేశారు. కాగా, గంగూలీకి బెం గాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు.

*చిత్రం...ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అతడి వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్.శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా