క్రీడాభూమి

ఆటగాళ్ల తీరుపై పాక్ కోచ్ అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 15: పాకిస్తాన్ హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ ఆటగాళ్ల కొంతమంది ఆటగాళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలంకతో సొం త గడ్డపై జరిగిన వనే్డ సిరీస్‌ను నెగ్గిన పాక్, టీ20లో మాత్రం వైట్‌వాష్‌కు గురైంది. దీంతో కొంతమంది మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు మి స్బాను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. టీ20ల్లో నెంబర్ వన్ జట్టుగా ఉన్న పాకిస్తాన్ అనుభ వం లేని శ్రీలంక జట్టు చేతిలో ఓడి పోవడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణిం చుకోవడం లేదు. ఇప్పటికే దీనిపై ఆగ్రహంగా ఉన్న మిస్బాకు ఆటగాళ్ల తీరు మింగుడు పడడం లేదు. జట్టు లో కొంతమంది క్రమశిక్షణగా లేరం టూ, కనీసం నెట్ సెషన్‌లో కూడా పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కెప్టెన్ సర్ఫ రాజ్ అహ్మద్ కూడా వారిని మంద లించకపోగా, వారికి భయపడుతున్న ట్లు పీసీబీ వద్ద పేర్కొన్నట్లు సమాచా రం. మరీ ముఖ్యమంగా వాహబ్ రియాజ్, ఇమాద్ వసీం, హారిస్ సోహై ల్‌లు కనీసం జట్టు చర్చలో కూడా పాల్గొనడం లేదని, సాకులు చెబుతూ నెట్ సెషన్‌కు సైతం రావడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
*చిత్రం... మిస్బా ఉల్ హక్