క్రీడాభూమి

స్మిత్ కెప్టెన్‌గా వస్తే మంచిదే: పైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 15: ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది పాటు జట్టులో చోటు కోల్పోయ, తిరిగి యాషెస్ సిరీస్ ద్వారా సత్తా చాటిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అనుకూలం గా మాట్లాడారు. స్మిత్ తిరిగి కెప్టెన్‌గా వస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, జట్టుకు మంచి నాయకత్వం ఇవ్వగలడని ఆ దేశ ప్రధాన పత్రిక డైలీ టెలిగ్రాఫ్‌తో పేర్కన్నాడు. ఇటీ వల ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో రాణించిన స్మిత్‌పై జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ కూడా స్మిత్ త్వరలోనే తిరిగి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేడతాడని పేర్కొన్న విష యం తెలిసిందే. అయతే ఇదే విషయమై టిమ్ పైన్ మాట్లా డుతూ స్మిత్ వస్తే జట్టుకు మంచే జరుగుతందని చెప్పడం సంచలనంగా మారింది. స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌తో జట్టు కు దూరమైన తర్వాత టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇందుకోసం ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)ను సైతం వదులుకున్నాడు.
*చిత్రం...స్టీవ్ స్మిత్, టిమ్ పైన్