క్రీడాభూమి

దాదా నయా టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : త్వరలో బీసీసీఐ నూతన అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టనున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ నెల 23న జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాడు. కాగా, బీసీసీఐలో తన కొత్త టీమ్ ఇదేనంటూ వారితో దిగిన ఫొటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇందులో గంగూలీతో పాటు బీసీసీఐ సెక్రటరీ పదవి చేపట్టనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జైషా, ట్రెజరర్ అరుణ్‌దుమాల్, వైస్ ప్రెసిడెంట్ మహిమ్ వర్మ, జాయంట్ సెక్రటరీ జయేష్ జార్జి ఉన్నారు. వీరం తా ఎలాంటి పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నిక కాను న్నారు. ఫొటోలో వీరితో పాటు అరుణ్ దుమాల్ అన్న అనురాగ్ ఠాకూ ర్ కూడా ఉన్నాడు. ఈ సంద ర్భంగా గంగూలీ ‘బీసీసీఐలో ఇదే నా కొత్త టీమ్. మేమంతా కలిసి బాగా పనిచేస్తామని అనుకుం టున్నా. ఇక్కడకు వచ్చినం దుకు అనురాగ్ ఠాకూర్‌కి ధన్యవాదా లు’ అంటూ గంగూలీ పేర్కొన్నాడు.