క్రీడాభూమి

జైస్వాల్ రికార్డు డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూర్, అక్టోబర్ 16: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 39 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 154 బంతుల్లోనే 204 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆదిత్య థారే (78) రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయ 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జార్ఖండ్ జట్టు 319 పరుగులకే కుప్ప కూలి పరాజయం పాలైంది. జార ఖండ్ బ్యాట్స్‌మెన్లలో విరాట్ సింగ్ (100), అంకుల్ రాయ్ (46), కెప్టెన్ ఇషాన్ కిషన్ (34) మాత్రమే రాణించారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన జైస్వాల్ రికార్డు సృష్టించాడు. లీస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసు (17)లో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డు ల్లోకి ఎక్కాడు. అలాగే డబుల్ సెంచరీ సాధించిన 9వ బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం సంజూ శాంసన్ (212, నాటౌట్) ముందున్నాడు.