క్రీడాభూమి

గవాస్కర్ సరసన చోటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: సంచలన ఓపెనర్ రోహిత్ శర్మ ఒక టెస్టు సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సరసన చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టులో రోహిత్ శనివారం తన మూడో టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది ఆరో టెస్టు సెంచరీ.
విదేశీగడ్డపై ఒక్క టెస్టు సెంచరీ కూడా సాధించలేకపోయినప్పటికీ, స్వదేశంలో మాత్రం ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. బంగ్లాదేశ్‌కు చెందిన మోమినుల్ హక్‌కు విదేశాల్లో శతకం లేదు. అయితే, స్వదేశంలో అతను ఎనిమిది సెంచరీలు చేశాడు. విదేశాల్లో సెంచరీ లేని రోహిత్ స్వదేశంలో ఆరో టెస్టు సెంచరీ సాధించాడు. ఐదు శతకాలతో స్టాన్లీ జాక్సన్ (ఇంగ్లాండ్), చందూ బోర్డే (్భరత్) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
రోహిత్ శర్మ, అజింక్య రహానే దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని అందించిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించారు. చివరిదైన మూడో టెస్టు తొలి రోజు ఆటలో వీరు నాలుగో వికెట్‌కు అజేయంగా 180 పరుగులు జోడించారు. ఇదే సిరీస్ పుణే టెస్టులో విరాట్ కోహ్లీ, రహానే 178 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ రికార్డు ఇప్పుడు బద్దలైంది. 1996-97 సీజన్‌లో జరిగిన సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ నాలుగో వికెట్‌కు 145 పరుగులు జత కలిపారు.
*చిత్రం... రోహిత్ శర్మ