క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 20: భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 224): మాయాంక్ అగర్వాల్ సీ డీన్ ఎల్గార్ బీ కాగిసో రబదా 10, రోహిత్ శర్మ సీ లున్గీ ఎన్గిడీ బీ కాగిసో రబదా 212, చటేశ్వర్ పుజారా ఎల్‌బీ కాగిసో రబదా 0, విరాట్ కోహ్లీ ఎల్‌బీ ఎన్రిచ్ నోర్జె 12, అజింక్య రహానే సీ హెన్రిచ్ క్లాసెన్ బీ జార్జి లినే్డ 115, రవీంద్ర జడేజా సీ హెన్రిచ్ క్లాసెన్ బీ జార్జి లినే్డ 51, వృద్ధిమాన్ సాహా బీ జార్జి లినే్డ 24, రవిచంద్రన్ అశ్విన్ స్టంప్డ్ హెన్రిచ్ క్లాసెన్ బీ డేన్ పిడిట్ 14, ఉమేష్ యాదవ్ సీ హెన్రిచ్ క్లాసెన్ బీ జార్జి లినే్డ 31, షాబాజ్ నదీం 1 నాటౌట్, మహమ్మద్ షమీ 10 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (116.3 ఓవర్లలో 9 వికెట్లకు) 497 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-12, 2-16, 3-39, 4-306, 5-370, 6-417, 7-450, 8-464, 9-482.
బౌలింగ్: కాగిసో రబదా 23-7-85-3, లున్గీ ఎన్గిడీ 20-5-83-0, ఎన్రిచ్ నోర్జె 24.3-5-79-1, జార్జి లినే్డ 31-2-133-4, డేన్ పిడిట్ 18-3-101-1.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గార్ సీ వృద్ధిమాన్ సాహా బీ మహమ్మద్ షమీ 0, క్వింటన్ డి కాక్ సీ వృద్ధిమాన్ సాహా బీ ఉమేష్ యాదవ్ 4, జుబేర్ హమ్జా 0 నాటౌట్, ఫఫ్ డు ప్లెసిస్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (5 ఓవర్లలో 2 వికెట్లకు) 9.
వికెట్ల పతనం: 1-4, 2-8.
బౌలింగ్: మహమ్మద్ షమీ 1-1-0-1, ఉమేష్ యాదవ్ 1-0-4-1, షాబాజ్ నదీం 2-2-0-0, రవీంద్ర జడేజా 1-0-1-0.
*
* మూడు మ్యాచ్‌ల ప్రస్తుత సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. వారు మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 14, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే జోడించగలిగారు. రెండో టెస్టులోనూ అదే పరిస్థితి కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగుల భాగస్వామ్యం మాత్రమే నమోదైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మర్‌క్రామ్ రెండో బంతికే ఔటయ్యాడు. ఫలితంగా తొలి వికెట్‌కు ఒక్క పరుగు కూడా రాలేదు. కాగా, ఇప్పుడు జరుగుతున్న మూడవ, చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే దక్షిణాఫ్రికా ఓపెనింగ్ జోడీ విచ్ఛిన్నమైంది. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టగా, డీన్ ఎల్గార్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.
* టెస్టు క్రికెటర్ అంటూ ముద్ర పడిన అజింక్య రహానే కెరీర్‌లో 11వ టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. 2016 తర్వాత అతను టెస్టుల్లో సెంచరీ సాధించడం ఇదే మొదటిసారి. స్వదేశంలో అతనికి ఇది నాలుగో సెంచరీకాగా, దక్షిణాఫ్రికాపై మూడోది. ఇలావుంటే, ఈ సిరీస్‌లో మొత్తం ఏడు శతకాలు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ల్లో అత్యధిక శతకాలు ఇవే. 2009-10 సీజన్‌లో ఆరు శతకాలు నమోదుకాగా, ఆ రికార్డు ఇప్పుడు బద్దలైంది.
* ఒక టెస్టు సిరీస్‌లో భారత బ్యాట్స్‌మన్ వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ చేయడం ఇది రెండోసారి. ఈ సిరీస్ మొదటి టెస్టు (వైజాగ్)లో మాయాంక్ అగర్వాల్ (215), రెండో టెస్టు (పుణే)లో విరాట్ కోహ్లీ (254 నాటౌట్), ప్రస్తుతం రాంచీలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (212) డబుల్ సెంచరీలు చేశారు.

* దక్షిణాఫ్రికాపై ఒక టెస్టు సిరీస్‌లో ఐదు వందలకుపైగా పరుగులు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 212, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు సాధించాడు. దీనితో, ఈ సిరీస్‌లో ఇంత వరకూ అతని ఖాతాలో 529 పరుగులు చేరాయి. 1996-97 సీజన్‌లో, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో మహమ్మద్ అజరుద్దీన్ 388 పరుగులు చేశాడు. ఆ రికార్డును ప్రస్తుత సిరీస్‌లో ఇది వరకే అధిగమించిన రోహిత్ ఇప్పుడు 500లకు పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
* ఒక టెస్టు సిరీస్‌లో ఐదువందలకుపైగా పరుగులు సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా కూడా రోహిత్ పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. ఇది వరకు వినూ మన్కడ్, బుధీ కుందన్, సునీల్ గవాస్కర్, వీరేందర్ సెవాగ్ ఈ ఘనతను అందుకున్నారు.
* టెస్టు సిరీస్‌ల విషయానికి వస్తే, దక్షిణాఫ్రికాపై ఒక సిరీస్‌లో రెండు పర్యాయాలు 150కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. టెస్టు చరిత్రలో మొత్తం మీద ఎనిమిదో బ్యాట్స్‌మన్. భారత్ తరఫున ఈ ఫీట్‌ను సాధించిన తొలి బ్యాట్స్‌మన్ కూడా అతనే. 2012-13 సిరీస్‌లో మైఖేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా) తర్వాత ఏదైనా ఒక టెస్టు సిరీస్‌లో ఒక బ్యాట్స్‌మన్ రెండు పర్యాయాలు 150కిపైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి.
*ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును కూడా రోహిత్ శర్మ అధిగమించడం విశేషం. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో బ్రాడ్‌మన్ సగటు 98.22 పరుగులుకాగా, తాజా డబుల్ సెంచరీతో రోహిత్ తన సగటును 99.84 పరుగులకు పెంచుకున్నాడు.

*చిత్రం... సెంచరీ సాధించిన రహానే.