క్రీడాభూమి

ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూన్ 2: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. స్థానిక క్రీడాకారిణి ఫిత్రియానిని ఆమె 21-11, 21-10 తేడాతో చిత్తుచేసి, నాలుగోసారి ఈ టైటిల్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. 2009, 2010, 2012 సంవత్సరాల్లో ఆమెకు ఇండోనేషియా ఓపెన్ టైటిల్ లభించింది. గత కొంతకాలంగా కాలి మడమ నెప్పితో బాధపడుతున్న సైనా కోలుకొని, మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం. కాగా, మహిళల డబుల్స్‌ల జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ, పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి పరాజయాలను ఎదుర్కోవడం అభిమానులను నిరాశ పరచింది. జ్వాలా, అశ్వినీ జోడీపై చైనాకు చెందిన హువాంగ్ యాక్వియాంగ్, తాంగ్ జిన్‌హువా జోడీ 21-9, 21-18 ఆధిక్యంతో విజయభేరి మోగించింది. మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 18-21, 13-21 తేడాతో కొరియాకు చెందిన కో సంగ్ హ్యున్, షిన్ బీక్ చియోల్ జోడీ చేతిలో ఓడింది.