క్రీడాభూమి

భళా.. భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 22: అంతా అనుకున్నట్లే జరిగింది. స్వదేశంలో కోహ్లీ సేనకు ఎదురే లేకుండా పోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతు న్న చివరిదైన మూడో టెస్టులో భారత్ 202 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో మూడు టెస్టుల మ్యాచ్ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 132/8తో మంగళవారం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు మరో పరుగు మాత్రమే జోడించి 133 పరుగులకు కుప్పకూలి దారుణమైన పరాజ యాన్ని మూటగట్టుకుంది. నాలుగో రోజు సఫా రీలు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బ్యాటిం గ్ చేయడం గమనార్హం. చివరి రెండు వికెట్లను నదీమ్ పడగొట్టడం విశేషం. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్, షబాజ్ నదీమ్ రెండేసి వికెట్లను పడగొట్టారు. ఇక రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకు న్నారు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించి రెం డు డబుల్ సెంచరీలు సాధించిన భారత్ ఓపెన ర్ రోహిత్‌శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ లు దక్కాయి.
తిరుగులేని భారత్, కోహ్లీ..
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో గెలవడంతో స్వదేశంలో భారత జట్టు, కెప్టెన్ కోహ్లీకి తిరుగులేకుండా పోయంది. ఈ విజయంతో భారత్ స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌ల్లో సాధించి రికార్డు సృష్టించింది. గతంలో ఆస్ట్రేలియా స్వదే శంలో 10 టెస్టు సిరీ స్‌ల్లో గెలవగా, భారత్ కోహ్లీ సారథ్యంలో ఈ రికార్డును చెరిపి వేసింది. ఓవరాల్‌గా విరాట్‌కి ఇది 31 టెస్టు విజయం. అంతేకాకుండా దక్షిణా ఫ్రికాపై భారత కెప్టెన్లలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లీ సార థ్యంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో 10 టెస్టు లాడగా, ఏడింట్లో విజయం సాధించింది. కోహ్లీ కెప్టెన్సీలో విజయ శాతం 70గా ఉంది. మిగతా కెప్టెన్లందరిలో దక్షిణాఫ్రికాతో 29 టెసు టల్లో భారత జట్టు తలపడగా కేవలం ఏడింట్లో మాత్రమే విజయం సాధించింది. వీరి విజయా ల శాతం 24.14గా మాత్రమే నమోదైంది.
అందనంత దూరంలో..
ఈ ఏడాది నుంచే ప్రారంభమైన టెస్టు చాం పియన్ షిప్ లీగ్‌లో భారత్ మిగతా జట్లకు అందనంత దూరంలో ఉంది. ప్రస్తుతం దక్షిణా ఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో విజ యం సాధించడంతో భారత్ ఖాతాలో 120 పాయింట్లు చేరాయ. అంతకుముందు వెస్టిం డీస్ జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నూ 120 పాయింట్లు సాధించిన కోహ్లీ సేన ప్ర స్తుతం 240 పాయింట్లతో ఎవరికీ అందనంతో దూరంలో ఉంది. భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు 60 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలవ గా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ఒక్కో సిరీ స్ ఆడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఆరు, ఏడు స్థానా ల్లో 0 (సున్నా) పాయింట్లతో కొనసాగుతున్నాయి. కాగా, తొమ్మిది జట్లతో ప్రారంభమైన టె స్టు చాంపియన్‌షిప్ లీగ్‌లో బంగ్లాదేశ్, పాకిసా తన్ జట్లు ఇప్పటికీ ఎలాంటి టెస్టులు ఆడలేదు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ భారత్‌తో, పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో చాంపియన్‌షిప్ లీగ్‌లో తమ తొ లి టెస్టును ఆడనున్నాయి.

*చిత్రాలు..టెస్టు సిరీస్ ట్రోఫీతో భారత జట్టు

*రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్