క్రీడాభూమి

సానియా మీర్జా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ఇవాన్ డోడింగ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత స్టార్ సానియా మీర్జా ముందంజ వేసింది. వీరు క్వార్టర్ ఫైనల్‌లో చాన్ యుంగ్ జన్, మాక్స్ మిర్నియ్ జోడీని 6-1, 3-6, 10-6 తేడాతో ఓడించారు. కాగా, వేరువేరు భాగస్వాములతో కలిసి ఆడుతున్న లియాండర్ పేస్, రోహన్ బొపన్న పరాజయాలను చవిచూశారు. పురుషుల డబుల్స్‌లో రుమేనియాకు చెందిన ఫ్లోరియన్ మెర్గియాతో కలిసి ఆడిన బొపన్న 4-6, 4-6 తేడాతో ఇవాన్ డోడింగ్, మార్సెలో మెలో జోడీ చేతిలో ఓటమిపాలయ్యాడు. మార్సిన్ మాట్కోవ్‌స్కీతో కలిసి బరిలోకి దిగిన 6-7, 3-6 స్కోరుతో మైక్ బ్రియాన్, బాబ్ బ్రియాన్ జోడీ చేతిలో ఓడింది.
సెమీస్ చేరిన ముగురుజా
పారిస్: మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ గార్బినె ముగురుజా సెమీ ఫైనల్స్ చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె షెల్బీ రోజర్స్‌పై 7-5, 6-3 తేడాతో సులభంగా విజయం సాధించింది. ఫైనల్‌లో స్థానం కోసం ఆమె ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌ను ఢీ కొంటుంది. స్టొసుర్ క్వార్టర్ ఫైనల్‌లో స్వెతానా పిరొన్కొవాను 6-4, 7-6 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్‌లో ప్రపం చ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ 5-7, 6-4, 6-1 తేడాతో యూలిన్ పుట్నిత్సెవాపై గెలిచి సెమీస్ చేరింది.

చిత్రం సానియా మీర్జా, ఇవాన్ డోడింగ్ జోడీ