క్రీడాభూమి

భారత క్రికెట్ జట్టుకు స్వదేశీ కోచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 2: భారత క్రికెట్ జట్టుకు కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే, స్వదేశీ కోచ్‌నే నియమించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇతరత్రా అర్హతలతోపాటు హిందీలో మాట్లాడడం వచ్చిన వ్యక్తినే కోచ్‌గా నియమిస్తామని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. దీనితో స్వదేశీ కోచ్‌ని బిసిసిఐ నియమిస్తుందన్న వాదన బలాన్ని పుంజుకుంది. అదే నిజమైతే, రేసులో అందరి కంటే ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ రేసులో ముందు ఉంటాడు. ఇప్పటికే కోచ్‌తోపాటు టీమిండియా సపోర్టింగ్ స్ట్ఫా నియామకానికి బోర్డు ప్రకటన విడుదల చేసింది. దానిని అనుసరించి డైరెక్టర్ పదవికి రవి శాస్ర్తీ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. అదే విధంగా, కాంట్రాక్టు పూర్తయిన బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీ్ధర్ కూడా తిరిగి అవే పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. టీమిండియా సపోర్టింగ్ స్ట్ఫా అద్భుత సేవలు అందిస్తున్నదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఈ నలుగురి ఎంపిక ఖాయమన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నది.
బంగార్‌కు తాత్కాలికంగా హెచ్‌కోచ్ బాధ్యతను అప్పచెప్పిన బిసిసిఐ, కొత్త కోచ్ సాధ్యమైనంత త్వరగా నియమించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇంగ్లీషుతోపాటు హిందీ మాట్లాడడం వస్తేనే ఆటగాళ్లతో కోచ్‌కి సాన్నిహిత్యం పెరుగుతుందని బిసిసిఐ అభిప్రాయపడుతున్నది. అందుకే, కోచ్ ఎంపిక ఏ కోణంలో జరుగుతుందో, ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారో ఠాకూర్ చెప్పకనే చెప్పాడు. హిందీ మాట్లాడడాన్ని ముఖ్యమైన అర్హతగా భావిస్తే, ద్రవిడ్ ఈరేసులో ముందు ఉంటాడన్నది ఖాయం. గతంలో సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. రవి శాస్ర్తీని పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, సచిన్ తెండూల్కర్‌తోపాటు గంగూలీ, లక్ష్మణ్‌ను భారత క్రికెట్ సలహాదారులుగా బిసిసిఐ నియమించింది. రవి శాస్ర్తీకి టీమిండియా డైరెక్టర్ బాధ్యతలను అప్పగించింది. సునీల్ గవాస్కర్ కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు. ఈ నేపథ్యంలో చాలా మందికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి ద్రవిడ్ ఒక్కడే. ఇప్పటికే టీమిండియా ‘ఎ’ జట్టుకు కోచ్‌గా అతను తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. బిసిసిఐ కూడా అతని పట్ల సుముఖత వ్యక్తం చేయవచ్చు.
రవి శాస్ర్తీకే అదనపు బాధ్యతలు?
కొత్త కోచ్ గురించిన మరో వాదన కూడా వినిపిస్తున్నది. టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తో టీమిండియా డైరెక్టర్‌గా బిసిసిఐతో రవి శాస్ర్తీ కాంట్రాక్టు ముగిసింది. అతను మళ్లీ డైరెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పదవి అతనికే దక్కడం దాదాపుగా ఖాయమైంది. నిరుడు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15వ తేదీ వరకు జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తో అప్పటి కోచ్ డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు ముగిసింది. అంతకు ముందే జట్టు డైరెక్టర్ పదవిని కొత్తగా సృష్టించి మరీ రవి శాస్ర్తీని తీసుకున్న బిసిసిఐ పరోక్షంగా కోచ్ బాధ్యతలను అతనికే అప్పచెప్పింది. వరల్డ్ కప్ టోర్నీలో ఫ్లెచర్ నామమాత్రపు కోచ్‌గా మారగా, రవి శాస్ర్తీ చక్రం తిప్పాడు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వివిధ సిరీస్‌లు, టోర్నీలకు కోచ్‌గా ఎవరిని నియమించకుండా, ఆ బాధ్యతలను రవి శాస్ర్తీ చేతికే ఇచ్చింది. మరోసారి అతనికి కోచ్‌గా అదనపు బాధ్యతలనిచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారికి హిందీ మాట్లాడడం వచ్చి ఉండాలని ఠాకూర్ స్పష్టం చేయడంతో ద్రవిడ్ లేదా రవి శాస్ర్తీకి ఆ పదవి దక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీమిండియా కోచ్ రేసులో ముందున్న భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (ఫైల్ ఫొటో)