క్రీడాభూమి

వార్నర్, స్మిత్ అర్ధ సెంచరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్స్, అక్టోబర్ 30: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిం ది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలోనే 117 పరు గులు చేసి ఆలౌటైంది. వికెట్ కీపర్ కుశల్ పెరీరా (27), ఓపెనర్ ధనుష్క గుణతిలక (21) మాత్రమే ఫర్వాలేదని పించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బిల్లీ స్టాన్‌లేక్, పాట్ కమ్మి న్స్, ఆస్టాన్ అగర్, ఆడమ్ జంపా తలా రెండేసి వికెట్లను తీశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో కంగారులు 13 ఓవర్లలోనే వికెట్ నష్టపోయ విజయం సాధించారు. డేవిడ్ వార్నర్ (60, నాటౌట్), స్టీవ్ స్మిత్ (53, నాటౌట్) అర్ధ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషిం చారు. కెప్టెన్ ఆరోన్‌ఫించ్ మలింగ బౌలింగ్‌లో మొదటి ఓవర్‌లోనే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ విజయంతో ఆ స్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో గెలుచుకుంది.
*చిత్రం... డేవిడ్ వార్నర్