క్రీడాభూమి

నీ కెప్టెన్సీలో 2023 ప్రపంచకప్ ఫైనల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: షకీబుల్ హసన్ కెప్టెన్సీలోనే సారథ్యంలో 2023 ప్రపంచకప్ ఫైనల్ ఆడతామని బంగ్లాదేశ్ పేసర్ మషఫ్రె మోర్తాజా పేర్కొన్నాడు. ఐసీసీ షకీబ్‌పై నిషేధం విధించడంతో వచ్చే అక్టోబర్ 29 వరకు ఆటకు దూరం కాను న్నాడు. ఈ సందర్భంగా అతడికి మద్దతుగా సహచరులు మష్ఫి కర్ రహీమ్, మోర్తాజా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరిత పోస్టులు పెట్టారు. ‘18 ఏళ్ల పాటు కలిసి ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా ఆడడాన్ని ఊహించుకోవడం బాధగా ఉంది. చాంపియన్‌గా మళ్లీ తిరిగి వస్తావని ఆశిస్తున్నా. నీకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. అలాగే దేశం మద్దతు కూడా ఉంటుం ది. ధైర్యంగా ఉండు’ అని ముష్ఫికర్ పేర్కొన్నాడు. దీనిపై మోర్తాజా స్పందిస్తూ ‘షకీబ్‌పై జరుగుతున్న తాజా పరిణామా లు చూస్తుంటే కచ్చితంగా నాకు కొన్ని రాత్రులు నిద్రపట్టదు. షకీబ్ సారథ్యంలోనే 2023 ప్రపంచకప్ ఫైనల్ ఆడతాతమనే ఆశతో నిద్రిస్తా’అని భావోద్వేగం చెందాడు.