క్రీడాభూమి

మహ్మద్ అలీకి తీవ్ర అస్వస్థత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫీనిక్స్ (అమెరికా), జూన్ 3: దీర్ఘ కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అలనాటి బాక్సింగ్ వీరుడు, ప్రపంచ హెవీ వెయిట్ మాజీ చాంపియన్ మహ్మద్ అలీ (74) అమెరికాలోని ఫీనిక్స్ ప్రాంతంలో మరోసారి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన గతంలో కంటే మరింత తీవ్రస్థాయిలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని అలీ పరిస్థితి గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. 1980వ దశకం నుంచి అలీ పార్కిన్సన్స్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రస్తుతం శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తడంతో మహ్మద్ అలీ పరిస్థితి మరింత దిగజారిందని, దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అలీ గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు గురువారం అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థకు తెలిపారు. అయితే అలీ కుటుంబ సభ్యుల తరఫున ఈ విషయాన్ని చెప్పనందున పేర్లను వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇదిలావుంటే, మహ్మద్ అలీకి శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని ఆయన అధికార ప్రతినిధి బాబ్ గనె్నల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం అలీ పరిస్థితి స్థిమితంగానే ఉందని, కనుక ఎక్కువ రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉండకపోవచ్చని భావిస్తున్నానని గనె్నల్ తెలిపాడు. కాగా, ప్రస్తుతం అలీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం గురించి మాట్లాడేందుకు దీర్ఘ కాలం నుంచి ఆయనకు వైద్యసేవలు అందిస్తున్న పార్కిన్సన్స్ నిపుణుడు డాక్టర్ అబ్రహాం లీబెర్మన్ నిరాకరించాడు.