క్రీడాభూమి

తొలి మ్యాచ్‌లో కివీస్ పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్ట్‌చర్చ్, నవంబర్ 1: ఇంగ్లాండ్‌తో సొంత గడ్డపై జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ పరాజయం పాలైంది. శుక్రవారం క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయ 153 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రాస్ టేలర్ (44), వికెట్ కీపర్ టిమ్ సిఫెర్ట్ (32), డరియల్ మిచెల్ (30, నాటౌట్) రాణించారు. ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ జోర్దాన్ 2 వికెట్లను పడగొట్టగా, సామ్ కుర్రాన్, అదిల్ రషీద్, ప్యాట్రిక్ బ్రౌన్ తలా 1 వికెట్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు నష్టపోయ విజయం సాధించింది. జేమ్స్ విన్స్ (59), జానీ బెయర్ స్టో (35), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (34, నాటౌట్) రాణించారు. దీంతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు 1-0తో బోణీ చేసింది. ఇదిలాఉంటే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఇరు జట్లు తలపడడం ఇదే మొదటిసారి.