క్రీడాభూమి

ఆసీస్ చేతిలో బంగ్లా వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, నవంబర్ 1: మూడు మ్యాచ్‌ల టీ20లో సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయ 142 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశల్ మెండీస్ (13) నిరాశ పర్చగా, నిరోషన్ డిక్వెల్లా (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ కుశల్ పెరీరా, అవిష్క ఫెర్నాండోతో కలిసి జట్టు స్కోరును పెంచే బాధ్యత తన భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలో ఫెర్నండో (20) కూడా అవుట్ కావడంతో 76 పరుగులకే లంక మూడు కీలక వికెట్లను కోల్పోయంది. అప్పటికే జోరుమీదున్న కుశల్ పెరీరా (57) అర్ధ సెంచరీ సాధించి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఒషాడ ఫెర్నాండో (6), షెహన్ జయసూరియా (12) విఫలమవ్వగా, భనూక రాజపక్స (17, నాటౌట్), లసిత్ మలింగ (8, నాటౌట్) చివర్లో చెలరేగడంతో 6 వికెట్లను కోల్పోయ 142 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, పాట్ కమ్మిన్స్ తలా రెండేసి వికెట్లను పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో కంగారులు 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయ విజయం సాధించారు. డేవిడ్ వార్నర్ (57, నాటౌట్) మరోసారి అర్ధ శతకంతో చెలరేగగా, ఆరోన్ ఫించ్ (37), ఆస్టన్ టర్నర్ (22, నాటౌట్) రాణించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసిస్ 3-0తో గెలుచుకుంది.