క్రీడాభూమి

మహిళల ఫుట్‌బాల్ ఫ్రెండ్లీలో భారత్‌ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో ఆదివారం వియత్నాంతో జరిగిన మొదటి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పరాజయాన్ని చవిచూసింది. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లను ఫిఫా తన షెడ్యూల్‌లో చేర్చింది. దీని ప్రకారం, జరిగిన మొదటి మ్యాచ్‌లో వియత్నాం ఆది నుంచి చివరి వరకూ పట్టును కొనసాగించింది. మ్యాచ్‌ని 3-0 తేడాతో గెల్చుకుంది. భారత మహిళలు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వియత్నాం తరఫున థి హుంగ్ 8వ నిమిషంలో గోల్ చేసి, తన జట్టును 1-0 ఆధిక్యంలో నిలబెట్టింది. ఆతర్వాత భారత మహిళలు ఎదురుదాడికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు వియత్నాం అభేద్యమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రత్యర్థులు దూసుకురాకుండా అడ్డుకోగలిగింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. వియత్నాం రక్షణ వలయాన్ని ఛేదించి గోల్స్ చేయడంలో భారత మహిళలు విఫలమయ్యారు. కాగా, మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు, విజయం ఖాయంగా కనిపించడంతో వియత్నాం ఒక్కసారిగా నారత గోల్ పోస్టుపై విరుచుకుపడింది. తి వాన్ 82వ నిమిషంలో, తి తూయ్ హాంగ్ 89వ నిమిషంలో గోల్స్ సాధించారు. ఒకటిరెండు పర్యాయాలు గోల్స్ చేసే అవకాశం లభించినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిన భారత్‌కు 0-3 తేడాతో పరాజయం తప్పలేదు.