క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో బంగ్లా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, నవంబర్ 4: చివరి బం తి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ మహిళా జట్టు వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం జరిగిన రెండో వనే్డలో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టులో ఓపెనర్ బ్యాట్స్ వుమన్ నహిదా ఖాన్ (63) అర్ధ సెంచరీ సాధించగా, అలియా రియా జ్ (36), కెప్టెన్ బిస్మా మరూఫ్ (34) ఫర్వాలేదనిపించడంతో 48.4 ఓవర్లలో 210 పరుగులకే పాక్ జట్టు కుప్ప కూలింది. బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ రుమానా అహ్మద్ 3 వికెట్లు పడగొట్ట గా, సల్మా ఖతూన్ 2, పన్నా ఘోష్ 1 వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఫర్గానా హక్ (67) అర్ధ సెంచరీకి తోడు ఓపెనర్ ముర్షిదా (44), రుమానా అహ్మద్ (31) రాణిం చారు. ఈ విజయంతో రెండు మ్యా చ్‌ల వనే్డ సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తేడాతో సమంగా నిలిచాయ.
*చిత్రం...ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో ఫర్గానా హక్