క్రీడాభూమి

ఇప్పటికీ నేనే కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: భారత్ టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) పాకిస్తాన్‌తో టైకి రోహిత్ రాజ్‌పాల్‌ను నాన్ పేయంగ్ కెప్టెన్‌గా ఎంపిక చేసినా, తాను అందుబాటులో ఉంటానని భారత డేవిస్ కప్ జట్టుకు ఇప్పటికీ తానే కెప్టెన్ అని మహేశ్ భూపతి అన్నాడు. మ్యాచ్ వేదిక ఇస్లామా బాద్‌లో కావడంతో మొదటగా భూపతి సహా మరి కొంద రు ఆటగాళ్లు భద్రత కారణాల రీత్యా అక్కడికి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఏఐటీఏ భూపతి, రోహన్ బోపన్న సహా ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లందరినీ మ్యాచ్ నుంచి తప్పించిం ది. అయతే ఐటీఎఫ్ అంగీకారంతో మ్యా చ్‌ను తటస్థ వేదికకు మార్చేలా ఒప్పించింది. అప్పటికే భూ పతిని కాదని ఏఐటీఏ రాజ్‌పాల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిం ది. అయతే దీనిపై మహేశ్ భూపతి మాట్లాడు తూ పాక్ వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో ఏఐటీఏ చీఫ్ సోమవారం తనకు ఫోన్ చేసి నా స్థానంలో రోహిత్‌ను నాన్ ప్లేయంగ్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తున్నట్లు చెప్పారన్నాడు. ఆట గాళ్ల ఇబ్బందులను ఐటీఎఫ్ పరిగణలోకి తీసుకొని మ్యాచ్ ను తటస్థ వేదికకు మార్చినట్లు చెప్పలేదన్నాడు. మరో విష యం చెప్పనంత వరకు నేనే కెప్టెన్ అని నమ్ముతున్నానని, మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని భూపతి పేర్కొన్నా డు. ఇదిలాఉంటే తమను సంప్రదించకుండా కెప్టెన్‌ను ఎలా మారుస్తారన్న రోహన్ బోపన్న వ్యాఖ్యలను ఏఐటీఏ కొట్టిపడేసింది. అతడికి సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఘాటుగా బదులిచ్చింది.