క్రీడాభూమి

రెండో రౌండ్‌లో సాయి ప్రణీత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుజౌ (చైనా), నవంబర్ 7: భారత షట్లర్ సాయి ప్రణీత్ గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. డెన్మార్క్ ఆటగాడు అండర్స్ ఆంటోనె్సన్ చేతిలో 20-22, 22-20, 16-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో చైనా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్ పోరు ముగిసినట్లయంది. తొలి గేమ్‌లో తీవ్రంగా పోరాడి ఓడిన సాయ ప్రణీత్, రెండో గేమ్‌లో పుంజుకొని ప్రత్యర్థిని చిత్తు చేశాడు. అయతే చివరిదైన మూడో గేమ్‌లో మాత్రం మొదట్లోనే తడబడ్డా డు. చివర్లో రాణించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో మ్యాచ్‌ను కోల్పోయా డు. ఇక మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా, సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లో ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఇక మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్-సిక్కిరెడ్డి 14-21, 14-21తో వాంగ్-చెంగ్ (చైనీస్ తైపీ) చేతిలో, పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మను అత్రి 23-21, 21-19 తేడాతో ఆరోన్-సోవూ (మలేసియా) చేతిలో ఓడిపోయారు.
క్వార్టర్స్‌కు సాత్విక్ సాయరాజ్-చిరాగ్ జోడీ
పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ సాయరాజ్ రంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి ఆరో సీడ్‌కు చెందిన జపాన్ జోడీ హిరోయుకీ ఎండో-యుటా వతనాబేపై రెండో రౌండ్‌లో 21-18, 21-23, 21-11 తేడాతో విజయం సాధించి, క్వార్టర్స్ ఫైనల్‌లోకి అడుగుపెట్టారు.