క్రీడాభూమి

టైటిల్ ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరోటి నెగ్గాయ. దీంతో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబడిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమి తమైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా అంతా విఫలమ్యారు. బంగ్లా ఆటగాళ్లు పట్టుదలతో రాణించి 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచి, తొలిసారి భారత్‌పై టీ20ల్లో విజయాన్ని నమోదు చేశారు. అయతే ప్రత్యర్థి జట్టు ఢిల్లీలో ప్రతికూల పరిస్థితుల్లోనూ గెలవడంపై సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఎలాంటి పొరపాట్లను చేయలేదు. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీకి తోడు శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్‌లు రాణించారు.
రెండు సార్లు టాస్ వారిదే..
గత రెండు మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్టే టాస్ నెగ్గడం విశేషం. తొలి మ్యాచులో టాస్ గె లిచి బౌలింగ్ ఎంచుకున్న బంగా లదేశ్ జట్టు, రెండో టీ20లోనూ టాస్ గెలిచిన ఈసారి మొదటగా బ్యాటింగ్‌కు దిగి బోల్తా పడింది.
మార్పులు తథ్యమేనా..?
గత రెండు మ్యాచుల్లో భారత్ బౌలింగ్ విభాగంలో తడబడింది. ముఖ్యంగా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ తన అంచనాలను అందుకోలేకపోవడమే కాకుండా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిపై వేటు పడే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఖలీల్‌పై వేటు పడితే అతడి స్థానంలో ఆడేందుకు శార్దుల్ ఠాకూర్ సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో ఫర్వాలేదనిపించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూ తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. కీపింగ్‌లో పొరపాట్లు చేయడం, సీనియర్ క్రికెటర్లను అనుసరించడంతో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పంత్‌పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. అయతే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రిషభ్‌కు అనుకూలంగా మాట్లాడడంతో అతడికి తుది జట్టులో చోటు ఉండేది, లేనిది తేలాల్సి ఉంది. అయతే పంత్‌కు ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్ ఉండడంతో అతడిని కనీసం చివరి మ్యాచులోనైనా ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇదిలాఉంటే రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని సంజూకి అవకాశమివ్వాలని కూడా ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూడో స్థానంలో వస్తున్న లోకేష్ రాహుల్ కూడా ఇప్పటివరకు చెప్పుకోదగిన ఆట ఆడలేదు.
మరో రికార్డుకు చేరువలో రోహిత్..
ఈ సిరీస్ ద్వారా ఇప్పటికే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన హిట్‌మ్యాన్, రెండో మ్యాచ్ ద్వారా భారత్ తరఫున 100 టీ20లు ఆడిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. తాజాగా నేడు జరిగే మ్యాచ్‌లో రోహిత్‌శర్మ మరో రెండు సిక్సర్లు కొడితే అన్ని ఫార్మాట్లలో కలిపి 400 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ, ఓవరాల్‌గా మూడో బ్యాట్స్‌మన్‌గా నిలవనున్నాడు. ప్రస్తుతం రోహిత్ వనే్డలు (232), టెస్టులు (51), టీ20ల్లో (115)తో మొతం 398 సిక్సర్లు కొట్టాడు. హిట్ మ్యాన్ కంటే ముందు వెస్టిండీస్ మాజీ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ (534), పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ (476) ఉన్నారు.

*చిత్రం... ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న టీమిండియా ఆటగాళ్లు