క్రీడాభూమి

‘నేను కోహ్లీ లాంటి దాన్ని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 10: ‘నేను భారత జట్టు సారధి విరాట్ కోహ్లీ వంటి దాన్ని’ అని ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తనయ ఐవీ మాయ్ పేర్కొంది. ఆదివారం నాడిక్కడ వారింట్లో తండ్రితో కలిసి క్రికెట్ ఆడుతున్న సందర్భంగా ఇవీ పై వ్యాఖ్యలు చేసింది. వార్నర్ సతీమణి కేన్‌డైస్ వార్నర్ ఈ వీడియోను విడుదల చేసింది. తన తండ్రి త్రోచేస్తున్న బంతులను ఎదుర్కొంటూ ఇవీ ఆ వీడియోలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమె నోటినుంచి పదేపదే ‘నేను విరాట్ కోహ్లీని’ అనే మాటలు వినిపించాయి. అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దిగ్గజ క్రీడాకారుడిగా పేరున్న 33ఏళ్ల వార్నర్ కూతురికి భారత కెప్టెన్ కోహ్లీపై ఉన్న మక్కువ ఆ వీడియో తిలకించిన వారికి మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను వార్నర్ పోస్టు చేశారు. అలాగే వార్నర్ సతీమణి ఈ వీడియోను ట్విట్టర్‌లో ఉంచారు. ‘ఇండీ విరాట్‌లా తయారవ్వాలని కోరుకుంటోంది’ అని ఆమె పేర్కొంది. కాగా ఐపీఎల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ మొత్తం 5,412 పరుగులు సాధించాడు. గత కొన్ని సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న వార్నర్ సైతం 126 మ్యాచ్‌ల్లో 4,706 పరుగులు సాధించాడు. 2018 సీజన్‌లో అతను ఐపీఎల్‌లో అడలేదు. బ్యాన్ ఎత్తేసిన తర్వాత తిరిగి 2019 సీజన్‌లో రంగంలోకి దూకిన వార్నర్ 12 మ్యాచ్‌ల్లో 149.86 స్ట్రైక్ రేటుతో 692 పరుగులు సాధించాడు.