క్రీడాభూమి

బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: పేస్ బౌలర్ దీపక్ చాహర్ అద్భుత బౌలింగ్‌తో విజృంభించి ఆరు వికెట్లు కూల్చడంతో నాగర్‌పూర్‌లో జరిగిన మూడో టీ-20 డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టుపై భారత్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది.
2-1 ఆధిక్యతతో పైచేయి సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చాహర్ సాధించిన ఆరు వికెట్లలో హాట్రిక్ కూడా ఉండటం గమనార్హం. ఈ పొట్టి క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా చాహర్ గణుతికెక్కాడు. 3.2 ఓవర్లు బౌల్ చేసిన చాహర్ కేవలం ఏడు పరుగుల్చి 6 వికెట్లు పడగొట్టాడు. అలాగే శ్రేయస్ అయ్యర్, కేఎస్ రాహుల్ అర్థ సెంచరీలతో అలరించారు.
ఆత్మ న్యూనతా భావంతో ఉన్న బంగ్లాదేశ్ చేజింగ్‌లో చతికిల పడింది. కాగా 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన శివం దూబే చాహర్‌కు వెన్నుదన్నుగా నిలిచాడు. సాయంత్రం అధికంగా కురిసిన మంచు స్పిన్నర్లకు సహకరించలేదు. అయితే భారత పేసర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ నడ్డివిరిగింది. 33 బంతులు ఎదుర్కొన్న ఐయ్యర్ 62 పరుగులు చేయగా, 35 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 52 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరి హాఫ్ సెంచరీలతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బదులుగా విజిటింగ్ టీం 19.2 ఓవర్లలో అన్ని వికెట్లూ కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి 30 బంతులకు 50 పరుగులు కావాల్సిన తరుణంలో ఆరు వికెట్లు ఉండీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తీవ్ర ఒత్తిడికి గురైన బంగ్లా బ్యాట్స్‌మెన్ ఓపెనర్ మహమ్మద్ నరుూమ్ 48 బంతుల్లో 81 పరుగులు సాధించినా జట్టును విజయాన్ని అందించలేకపోయాడు. కేవలం 20 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. చాహర్ ఓపెనర్ లిటన్ దాస్, సౌమ్య సర్కార్‌లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. తొలిమ్యాచ్ ఆడుతున్న నరుూమ్ మహమ్మద్ మిధున్ (27 పరుగులు)తో కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ నరుూమ్ కొన్ని అద్భుతమైన షాట్లు కొట్టాడు. తొలుత ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ, శిఖర్‌ధావన్ (16 బంతుల్లో 19 పరుగులు) తో కలిసి సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాడు. రాజకోట్‌లో 85 పరుగులు చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌లో ఓ ఫుల్‌లెంగ్త్ బాల్‌ను ఆడబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
*చిత్రం... ఆరు వికెట్లు తీసిన భారత పేసర్ దీపక్ చాహర్‌ను అభినందిస్తున్న సహచరులు