క్రీడాభూమి

టీమిండియా కోచ్ పదవికి సందీప్ పాటిల్ దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 4: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ రేసులోకి దిగాడు. కొంత కాలం నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించి కొద్ది రోజులు కూడా తిరక్కుండానే ఆయన ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ పాటిల్ శనివారం పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశాడు. డాషింగ్ బ్యాట్స్‌మన్‌గా గతంలో భారత జట్టుకు సేవలు అందించిన సందీప్ పాటిల్ కెన్యా జట్టుకు కొంత కాలం పాటు కోచ్‌గా వ్యవహరించిన విషయం విదితమే. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బిసిసిఐలోని కొంత మంది పెద్దలు సందీప్ పాటిల్‌కు సూచించారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను సందీప్ పాటిల్ ధ్రువీకరించడం గానీ, ఖండించడం గానీ చేయలేదు. చీఫ్ సెలెక్టర్‌గా సందీప్ పాటిల్ పదవీ కాలం సెప్టెంబర్‌తో ముగుస్తుంది. అయితే ఆయన నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సెప్టెంబర్ నాటికి పూర్తి చేయవలసిన ప్రధాన పనుల్లో చాలా పనులను ఇప్పటికే పూర్తి చేసింది. గత నెల 23వ తేదీన ముంబయిలో సమావేశమైన ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ వాస్తవానికి మరికొద్ది రోజుల్లో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును మాత్రమే ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ జట్టుతో పాటు జూలై నుంచి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును కూడా ఎంపిక చేసింది.