క్రీడాభూమి

ఉత్తరాఖండ్‌పై బరోడా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 11: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏ రౌండ్ 3లో సోమవారం ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయ 201 పరుగులు చేసింది. దీపక్ హుడా (52), స్వప్నిల్ సింగ్ (47), ఆదిత్య వాగ్మోడ్ (32) రాణించారు. దీక్షాన్షు నెగీ 2 వికెట్లు పడగొట్టగా, ప్రదీప్ చమోలీ, హిమాన్షు బిస్త్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ 19.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ సైరబ్ రావత్ (70) అర్ధ సెంచరీ సాధించగా, కరణ్ వీర్ కౌశల్ (38) ఫర్వాలేదనిపించాడు. స్వప్నిల్ సింగ్, రిషీ ఆరోత్ మూడేసి వికెట్లు తీయగా, లక్‌మన్ మేరీవాలా 2, నినంద్ రత్వా 1 వికెట్ పడగొట్టారు.