క్రీడాభూమి

నిరసనలు, ఆందోళనల మధ్య హాంకాంగ్ ఓపెన్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, నవంబర్ 12: హోరెత్తించే నిరసనలు, ఆందోళనల మధ్య హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం మొదలైంది. మెయిన్‌డ్రా పోటీలు బుధవారం ప్రారంభమవుతాయి. వివిధ నేరాలపై అరెస్టయిన వారిని చైనాలో విచారించేందుకు అనుమతిస్తూ హాంకాంగ్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుమారు ఐదు నెలలుగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, హాంకాంగ్ బాడ్మింటన్‌లో ఆడేందుకు పలువురు చైనా క్రీడాకారులు చేరుకోవడంతో, నిరసల సెగ ఈ టోర్నమెంట్‌కు కూడా తాకింది. వేలాదిగా వెల్లువెత్తిన నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు లాఠీచార్జి చేశారు. బాష్పవాయువును ప్రయోగించారు. వాటర్ కానన్‌లను వినియోగించారు. కాగా, ఒకవైపు నిరసనలు కొనసాగుతుండగా, మరోవైపు టోర్నమెంట్ మొదలైంది. భారత వీరుడు సౌరభ్ వర్మ క్వాలిఫయర్స్‌ను సమర్థంగా ముగించుకొని మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. రెండో క్వాలిఫయర్స్‌లో అతను ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ క్లాబౌట్‌ను 21-19, 21-19 తేడాతో ఓడించి, పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. అతనితోపాటు ప్రపంచ 10వ ర్యాంక్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, హెచ్‌ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్ కూడా భారత్ తరఫున పోటీ పడతారు.