క్రీడాభూమి

ఆదమరిస్తే ప్రమాదమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: ‘పసికూన’ ముద్ర వేయించుకున్న బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఇక్కడ ప్రా రంభం కానున్న మొదటి టెస్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా అన్ని విధాలా సిద్ధమైంది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, ప్రత్యర్థిని తక్కువ అంచనావేసి, ఆదమరిస్తే టీమిండియాకు ప్రమాదం తప్పదనేది వాస్తవం. ఇటీవల కాలంలో బలమైన జట్లను కూడా బెంబేలిస్తున్న బంగ్లాదేశ్ మరోసారి తన పోరాట పటిమను చూపాలని ఉత్సాహపడుతున్నది. ఈ సిరీస్ కోల్పోయినా బంగ్లాదేశ్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండ దు. భారత్ ఓడితే మాత్రం పరువు పోగొట్టుకుంటుంది. చిన్న జట్టు చేతిలో, అది కూడా స్వదేశంలో సిరీస్‌ను కోల్పోతే ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన మరోసారి అదే స్థాయిలో రాణించి, బంగ్లాదేశ్‌ను చిత్తుచేస్తుందనేది అభిమానుల నమ్మకం. వారి అంచనాల మేరకు రాణించాల్సిన బాధ్యత నెత్తిన ఉన్న నేపథ్యంలో టీమిండియాపై ఒత్తిడి పెరుగుతుందనేది వాస్తవం.
భారత్ ఆధిపత్యం
బంగ్లాదేశ్‌తో ఇంత వరకూ జరిగిన 9 టెస్టుల్లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. ఏడు మ్యాచ్‌లను గెల్చుకుంది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. బంగ్లాతో ఒక్క మ్యాచ్‌ని కూడా చేజార్చుకోని టీమిండియా అదే ఒరవడిని కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2000లో తొలిసారి బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ ఆడిన భారత్ చివరి సారి ఈ ఫార్మాట్‌లో 2017లో ఢీ కొంది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ జరుగుతున్న టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. బంగ్లాదేశ్‌తో జరిగిన గత ఐదు టెస్టుల ఫలితాను గమనిస్తే, నాలుగు మ్యాచ్‌లను భారత్ గెల్చుకుంది. ఒక మ్యాచ్ డ్రా అయింది.
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మోమినుల్ హక్ నాయకత్వం వహిస్తున్న బంగ్లాదేశ్ జట్టులో ఇమ్రుల్ ఖయాస్ (ఓపెనర్), లింటన్ దాస్ (వికెట్‌కీపర్), మహమ్మద్ మిథున్ (టాప్ ఆర్డర్), మొసాడెక్ హొస్సేన్ (మిడిల్ ఆర్డర్), ఎన్నో సందర్భాల్లో జట్టును ఆదుకున్న ముష్ఫికర్ రహీం (వికెట్‌కీపర్), సైఫ్ హసన్ (టాప్ ఆర్డర్), షాద్మన్ ఇస్లాం (ఓపెనర్) వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వీరిలో కొందరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే తమను తాను నిరూపించుకున్నవారు కాగా, మరి కొందరు తమ ఉనికిని చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బౌలింగ్ విభాగంలో అబూ జయేద్, అల్ అమీన్ హొస్సేన్, ముష్ఫికర్ రహీం, నరుూమ్ హసన్, తైజుక్ ఇస్లాం కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మహమ్మదుల్లా, మెహదీ హసన్ ఆల్‌రౌండర్లుగా తమ సేవలు అందిస్తున్నారు.
మరో విజయంపై కన్ను
భారత్ మరో టెస్టు సిరీస్ విజయంపై కనే్నసింది. స్వదేశంలో అత్యధిక టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా ఇప్పటికే అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 2012-13 సీజన్‌తో మొదలైన భారత్ టెస్టు సిరీస్ విజయాలు ఇటీవల దక్షిణాఫ్రికాపై గెలుపుతో 11కు చేరాయి. ఆస్ట్రేలియా 1994-95 సీజన్ నుంచి 2000-01 సీజన్ మధ్య కాలంలో, స్వదేశంలో వరుసగా పది సిరీస్‌లను కైవసం చేసుకుంది. అదే జట్టు 2004 నుంచి 2008-09 సీజన్ మధ్య కాలంలోనూ వరుసగా పది సిరీస్‌లను సొంతం చేసుకుంది. వెస్టిండీస్ 1975-76 సీజన్ నుంచి 1985-86 సీజన్ మధ్య వరుసగా ఎనిమిది విజయాలను నమోదు చేసింది. ఇలావుంటే, స్వదేశంలో భారత్ సాధించిన 11 వరుస టెస్టు సిరీస్ విజయాల్లో, కెప్టెన్‌గా కోహ్లీ అందుకున్నవే ఎక్కువ కావడం విశేషం. మొదటి రెండు సిరీస్ విజయాల్లో టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. ఆతర్వాత కోహ్లీ వరుసగా నాలుగు సిరీస్‌ల్లో భారత్‌ను విజయపథంలో నడిపాడు. 2016-17 సీజన్‌లో ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకున్నప్పుడు, కోహ్లీతోపాటు అతను అందుబాటులో లేనప్పుడు అజింక్య రహానే భారత్‌కు నాయకత్వం వహించాడు. కాగా, 2017-18 సీజన్‌లో శ్రీలంకపై భారత్ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. 2018లో అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో, అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆతర్వాత వరుసగా రెండు పర్యాయాలు మళ్లీ కోహ్లీ నాయకత్వంలోనే భారత్ స్వదేశంలో సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద 11 సిరీస్‌ల్లో కోహ్లీ సొంతంగా ఏడు పర్యాయాలు, రహానేతో కలిసి ఒకసారి విజయాలను నమోదు చేసి, అగ్రస్థానంలో నిలిచాడు.
*ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌ల యుద్ధానికి భారత్ అన్ని విధాల సంసిద్ధమైంది. కాగితంపై చూస్తే అన్ని రంగాల్లోనూ ప్రత్యర్థి బంగ్లాదేశ్‌పై భారత్ అత్యంత పటిష్టంగా ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, అజింక్య రహానే అసాధారణమైన ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు బలాన్ని పెంచుతుంది. బంగ్లాదేశ్‌ను ఓడించడం దాదాపు ఖాయమే కనిపిస్తున్నప్పటికీ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదని గతం నేర్పించిన పాఠం.
*
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మిగతా స్టేడియాలతో పోలిస్తే చిన్నది. ఇందులో 27,000 మంది మాత్రమే మ్యాచ్‌ను తిలకించే అవకాశం ఉంది. 75 గజాల స్టేడియం మైదానం కాబట్టి, భారీ స్కోర్లు నమోదవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీకే నాయుడు, ముస్తాద్ అలీ, హోల్కర్ తదితరులంతా ఈ స్టేడియం నుంచే అంతర్జాతీయ మేటి క్రికెటర్లుగా ఎదిగినవారే. నరేంద్ర హిర్వాణీ, నమన్ ఓజా, రాజేష్ చౌహాన్ వంటి మేటి స్పిన్నర్లను అందించిన ఇండోర్‌లో క్రికెట్ అభిమానులు ఎక్కువ. అందుకే టెస్టు మ్యాచ్ అయినప్పటికీ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
*చిత్రాలు..భారత్‌తో గురువారం నుంచి మొదలుకానున్న మొదటి టెస్టు మ్యాచ్ కోసం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు మహమ్మద్ మిథున్, సైఫ్ అసన్ అబూ జాయేద్ తదితరులు.
*బంగ్లాదేశ్‌తో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ కోసం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా