క్రీడాభూమి

నిప్పులు చెరిగిన నరైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రావిడెన్స్ (గయానా), జూన్ 4: మూడు దేశాల అంతర్జాతీయ వనే్డ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి డే/నైట్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బోణీ చేసింది. 27 పరుగులకే 6 వికెట్లు కూల్చి కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అతనికి తోడు కార్లోస్ బ్రాత్‌వైట్ (2/35), జెరోమ్ టేలర్ (1/36), జాసన్ హోల్డర్ (1/37) తమ వంతు రాణించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన దక్షిణాఫ్రికా జట్టులో రిలీ రొసెయు (61) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్లు ఎవరూ సరిగా రాణించలేకపోయారు. ప్రత్యేకించి ఓపెనర్లు క్వింటాన్ డీకాక్ (30), హషీమ్ ఆమ్లా (20)తో పాటు కెప్టెన్ ఎబి.డివిలియర్స్ (31), జెపి.డుమినీ (23) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 46.5 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం 189 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ (11)తో పాటు మిడిలార్డర్‌లో మర్లాన్ శామ్యూల్స్ (1), వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్ (10), కార్లోస్ బ్రాత్‌వైట్ (8) విఫలమైనప్పటికీ ఓపెనర్ జేమ్స్ చార్లెస్ (31), డ్వెయిన్ బ్రావో (30) స్థిమితంగా ఆడారు. వీరి నిష్క్రమణ తర్వాత అర్ధ శతకంతో రాణించిన కీరన్ పొలార్డ్ 67 బంతుల్లో 67 పరుగులు సాధించడంతో పాటు కెప్టెన్ జాసన్ హోల్డర్ (10-నాటౌట్)తో కలసి మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించిన వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది.