క్రీడాభూమి

పులిపై స్వారీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలింగ్ విభాగం అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 150 పరుగులకే కుప్పకూల్చి పులిపై స్వారీ చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మోమినుల్ హక్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. 5వ ఓవర్ దాకా పరుగులు తీసేందుకు కష్టపడ్డ బంగ్లా ఓపెనర్లు ఆ తర్వాత నియంత్రణ కోల్పోయారు. ఉమేశ్ యాదవ్ వేసిన అద్భుత బంతికి ఇమ్రూల్ కైస్ (6) రహానేకు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్‌గా వెనుదిరగ్గా, ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (6) ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 6 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లిద్దరినీ కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టు పీకల్లోతు కష్టల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్ జట్టు స్కోరును పెంచే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఒక్కో పరుగు తీస్తూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 19 పరుగులు జోడించిన ఈ జంటను మహ్మద్ షమీ విడదీశాడు. షమీ వేసిన బంతిని ఆడే క్రమంలో మహ్మద్ మిథున్ (13) ఎల్బీగా అవుటై క్రీజును వదిలాడు. మరోవైపు కెప్టె న్ హక్ మాత్రం ముష్ఫీకర్ రహీంతో కలిసి నిదానంగా ఆడడం ప్రారంభించాడు. వీరిద్దరూ కొద్దిసేపు భారత బౌలర్లను పరీక్షించారు. అందివచ్చిన బంతులను మాత్రమే ఆడుతూ చెత్త బంతుల్ని వదిలి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. దీంతో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి బౌలర్లకు సవాల్‌గా నిలిచారు.
ఈ దశలో మోమినుల్ హక్ (37) అశ్విన్ వేసిన అద్భుత బంతికి బోల్తా పడి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మదుల్లా (10) ఒక బౌండరీ కొట్టి జోరుమీదున్నట్లు కనిపించినా, కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో బంగ్లాదేశ 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మరోవైపు అర్ధ సెంచరీకి సమీపిస్తున్న ముష్ఫీకర్ రహీం (43) షమీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక ఆ తర్వాత మెహిడీ హసన్ (0), వికెట్ కీపర్ లిటన్ దాస్ (21) వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేరారు. తైజుల్ ఇస్లాం (1), ఎబదత్ హుస్సేన్ (2) లు మరో 10 పరుగులు జోడించి అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 150 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండేసి వికెట్లను నేలకూల్చారు.
నిరాశపర్చిన రోహిత్..
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే అబు జాయేద్ వేసిన అద్భుత బంతికి రోహిత్ శర్మ (6) వికెట్ కీపర్ లిటన్‌దాస్‌కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన చటేశ్వర్ పుజారాతో కలిసి మయాంక్ నెమ్మదిగా ఆడుతూ, అందివచ్చిన బంతుల్ని బౌండరీల పంపి స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు పుజారా తన శైలికి భిన్నంగా ఆడుతూ వరుస బౌండరీలతో బంగ్లా బౌలర్లను ఆడుకున్నాడు. అప్పటికే చీకటి పడడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టపోయ 86 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (37, నాటౌట్) చటేశ్వర్ పుజారా (43, నాటౌట్) క్రీజులో ఉన్నారు.
స్కోర్ బోర్డు..
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: షద్మాన్ ఇస్లాం (సీ) సాహా (బీ) ఇషాంత్ 6, ఇమ్రూల్ కైస్ (సీ) రహానే (బీ) ఉమేశ్ 6, మోమినుల్ హక్ (బీ) అశ్విన్ 37, మహ్మద్ మిథున్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) షమీ 13, ముష్ఫీకర్ రహీం (బీ) షమీ 43, మహ్మదుల్లా (బీ) అశ్విన్ 10, లిటన్ దాస్ (సీ) కోహ్లీ (బీ) ఇషాంత్ 21, మెహిడీ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) షమీ 0, తైజుల్ ఇస్లాం (రనౌట్, రవీంద్ర జడేజా/సాహా) 1, అబూ జాయేద్ (నాటౌట్) 7, ఎబదత్ హుస్సేన్ (బీ) ఉమేశ్ 2.
ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 150 (58.3 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-12, 2-12, 3-31, 4-99, 5-115, 6-140, 7-140, 8-140, 9-148, 10-150.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 12-6-20-2, ఉమేశ్‌యాదవ్ 14.3-3-47-2, మహ్మద్ షమీ 13-5-27-3, రవిచంద్రన్ అశ్విన్ 16-1-43-2, రవీంద్ర జడేజా 3-0-10-0.
భారత్ మొదటి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (బ్యాటింగ్) 37, రోహిత్ శర్మ (సీ) లిటన్‌దాస్ (బీ) అబూ జాయేద్ 6, చటేశ్వర్ పుజారా (బ్యాటింగ్) 43.
ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 86 (26 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) వికెట్ల పతనం: 14-1
బౌలింగ్: ఎబదత్ హుస్సేన్ 11-2-32-0, అబూ జాయేద్ 8-0-21-1, తైజుల్ ఇస్లాం 7-0-33-0.
*చిత్రం... ఆనందంలో భారత్ ఆటగాళ్లు.