క్రీడాభూమి

క్రూస్ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 17: టోనీ క్రూస్ రెండు గోల్స్‌లో రాణించగా, బెలారస్‌ను 4-0 తేడాతో చిత్తుచేసిన జర్మనీ యూరో 2020 ఫైనల్స్ టోర్నీకి అర్హత సంపాదించింది. జర్మనీతోపాటు క్రొయేషియా, ఆస్ట్రియా, పోలాండ్, బెల్జియం జట్లు కూడా క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుత క్వాలిఫయర్స్‌లో మొదటి 16 స్థానాలు దక్కించుకున్న జట్లకు యూరో ఫైనల్స్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. కాగా, బెలారస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన జర్మనీ ప్రారంభంలో నింపాదిగా ఆడింది. ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. 41వ నిమిషంలో మథియాస్ గిన్టర్ తొలి గోల్ చేసి, జర్మనీ ఖాతా తెరిచాడు. మరో ఎనిమిది నిమిషాల్లోనే లియాన్ గొరెజ్కా ద్వారా జర్మనీకి మరో గోల్ లభించింది. 2-0 ఆధిక్యాన్ని సంపాదించడంతో, రెట్టించిన ఉత్సాహంతో జర్మనీ ఆటగాళ్లు బెలారస్‌పై దాడులను కొనసాగించారు. 55వ నిమిషంలో క్రూస్ తన మొదటి గోల్ చేశాడు. తర్వాత జర్మనీ కొంత సేపు డిఫెన్స్‌కు పరిమితంకాగా, 83వ నిమిషంలో క్రూస్ మరో గోల్ చేసి, తన జట్టు తిరుగులేని రీతిలో 4-0 తేడాతో విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
స్లొవేకియాతో తలపడిన క్రొయేషియా 3-1 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభమైన చాలా సేపటి వరకూ ఇరు జట్లు పూర్తిగా డిఫెన్స్ గేమ్ ఆడారు. 32వ నిమిషంలో స్లొవేకియా ఆటగాడు రాబర్ట్ బొజెనిక్ గోల్ చేశాడు. దీనితో కంగుతిన్న క్రొయేషియా ఎదురుదాడికి దిగింది. 56వ నిమిషంలో నికొలా వ్లాసిక్ ఈ జట్టుకు ఈక్వెలైజర్‌ను అందించాడు. మరో నాలుగు నిమిషాల్లోనే బ్రూనో పెట్కోవిచ్ గోల్ చేసి, క్రొయేషియా ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. 74వ నిమిషంలో ఇవాన్ పెరిసిక్ గోల్ సాధించి, తన జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. ఆతర్వాత వ్యూహాత్మకంగా రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన క్రొయేషియా సులభంగా గెలిచింది.
నార్త్ మసడోనియాను ఆస్ట్రియా 2-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ ఆరంభమైన ఏడో నిమిషంలోనే డేవిడ్ అలాబా గోల్ చేయగా, 48వ నిమిషంలో స్టెఫెన్ లైనర్ ఆస్ట్రియా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆతర్వాత ఆస్ట్రియా డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వగా, గోల్స్ కోసం నార్త్ మసడోనియా ప్రయత్నాలు ఫలించలేదు. ఇంజురీ టైమ్‌లో విక్టో స్టొజరొవ్‌స్కీ ద్వారా ఆ జట్టుకు కంటితుడుపు గోల్ లభించింది.
పోలాండ్ కూడా 2-1 తేడాతోనే ఇజ్రాయిల్‌పై గెలిచింది. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే పోలాండ్‌కు గ్రెగొర్జ్ క్రిచోవ్‌స్కీ గోల్‌ను అందించాడు. ఆతర్వాత ఇజ్రాయిల్‌ను గోల్స్ చేయకుండా నిలువరించడానికే పోలాండ్ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రథమార్థంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్థంలో క్రిజ్‌టోఫ్ పియాజ్లెట్ చేసిన గోల్‌తో పోలాండ్ ఆధిక్యం 2-0కు చేరింది. చివరి క్షణాల్లో మనెస్ డాబొర్ గోల్ చేసినప్పటికీ, ఇజ్రాయిల్‌ను 1-2 తేడాతో ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.
అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరచిన రష్యా 4-1 ఆధిక్యంతో రష్యాను ఓడించింది. ఎడెన్ హజార్డ్ రెండు గోల్స్ (33వ నిమిషం, 40వ నిమిషం) చేసి ఈ విజయంలో కీలక భూమిక పోషించాడు. అంతకు ముందు థోర్గాన్ హజార్డ్ 19వ నిమిషంలో గోల్ సాధించాడు. స్టార్ ఆటగాడు రొమెలూ లుకాకు 72వ నిమిషంలో గోల్ చేశాడు. మరో ఏడు నిమిషాల తర్వాత రష్యా క్రీడాకారుడు జార్జి జికియాటా గోల్‌ను నమోదు చేసి, బెల్జియం ఆధిక్యాన్ని తగ్గించగలిగాడుగానీ, తన జట్టును ఆదుకోలేకపోయాడు.
ఇలావుంటే, నెదర్లాండ్స్, నార్త్ ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
*చిత్రం...టోనీ క్రూస్