క్రీడాభూమి

కొరియా టూర్‌కు సైనా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాంజు (కొరియా), నవంబర్ 18: వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్న ప్రపంచ నంబర్ 9 క్రీడాకారిణి, భార త షట్లర్ సైనా నెహ్వాల్ కొరియా మా స్టర్ వరల్డ్ టూర్ 300 టోర్నీ నుంచి తప్పుకుంది. గత మ్యాచుల్లో తొలి రౌండ్ నుంచే ఇంటిబాట పడుతున్న సైనాకు కలిసి రావడం లేదు. దీంతో స్వదేశంలో నిర్వహించే సయ్యద్ మోదీ టోర్నీలో ఆమె పాల్గొనే అవకా శాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సైనా టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత మహిళల ప్రాతినిధ్యం లేకుం డా పోయంది. ఇదిలాఉంటే హంకాం గ్ సూపర్ సిరీస్‌లో సెమీస్ చేరుకొని తిరిగా ఫాం అందుకున్న కిదాంబి శ్రీకాంత్ ఈ టైటిల్ గెలవాలని ఉవ్వి ళ్లూరుతు న్నాడు. ఈ ఏడాది ఇండియా ఓపెన్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడం, గాయాల కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమై న విషయం తెలిసిందే. కొరియా ఓపె న్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ వాంగ్ వింగ్ కీవినె్సంట్‌తో తలపడనున్నాడు. మరో యువ ఆట గాడు, సమీర్ వర్మ చైనా టాప్ సీడ్ షీయూకీతో పురుషుల తొలి రౌండ్‌లో తలపడనున్నాడు. ఇక అర్హత పోటీలో చైనా రెండో సీడ్ చెన్‌లాంగ్‌తో మరో షట్లర్ సౌరభ్ వర్మ ఆడనున్నాడు.

*చిత్రం...భార త షట్లర్ సైనా నెహ్వాల్