క్రీడాభూమి

మహారాష్ట్ర విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 18: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా పంజాబ్, మహారాష్ట్ర జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ మహారాష్ట్ర 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధిం చింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయ 201 పరుగులు చేసింది. అజీమ్ ఖాజీ (71, నాటౌట్)తో పాటు కెప్టెన్ రాహుల్ త్రిపాఠి (63, నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ 2 వికెట్లు పడగొట్టగా, హర్పీత్ బ్రార్, మయాంక్ మార్కండే చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదన లో పంజాబ్ 7 వికెట్లు కోల్పోయ 156 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మన్‌దీప్ సింగ్ (67) అర్ధ సెంచరీ సాధించగా, అన్మోల్‌ప్రీత్ సింగ్ (36) ఫర్వాలేదనిపించారు. మహారాష్ట్ర బౌలర్లలో దిగ్విజయ్ దేశ్‌ముఖ్ 3 వికెట్లతో రాణించగా, సత్యజిత్ 2, సమాద్, ఖాజీ చెరో వికెట్ దక్కించుకున్నారు.