క్రీడాభూమి

హాంకాంగ్‌పై భారత్ అండర్-23 జట్టు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావర్, నవంబర్ 18: ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2019లో భారత అండర్-19 జట్టు హాంకాంగ్‌పై 120 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 322 పరుగులు చేసింది. చి న్మయ్ సుతార్ (104, నాటౌట్) సెంచరీకి తోడు కెప్టెన్, వికెట్ కీపర్ శరత్ బీఆర్ (90), శుభమ్ శర్మ (65, నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్లలో కిం చింత్ షా 3 వికెట్లు పడగొట్టగా, అజీజ్ ఖాన్, ఆఫ్తబ్ హుస్సేన్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో హాం కాంగ్‌ను 47.3 ఓవర్లలోనే 202 పరుగుల వద్ద ఆలౌట్ చేశారు. షాహిద్ వాసిఫ్ (68) అర్ధ సెంచరీ సాధించగా, ఇషాన్ ఖాన్ (36), అసన్ అబ్బాసి (25), ఆరూష్ భాగ్‌వత్ (22) రాణించారు. భారత బౌలర్లలో శుభమ్ శర్మ 4 వికెట్లు తీయగా, శివమ్ మవి, సిద్దార్థ్ దేశాయ్ రెండేసి వికెట్లు, కుల్దీప్ యాదవ్, సన్వీర్ సింగ్ ఒక్కో వికెట్‌తో రాణించారు.