క్రీడాభూమి

ఆద్యంతం ఆసక్తిగా.. చారిత్రాత్మక టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 20: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే చారిత్రాత్మక డే నైట్ టెస్టు ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ‘నా ఉత్తేజాన్ని గమనించండి. నాలుగు రోజుల టికెట్లు అప్పుడే అమ్ముడు పోయాయ’ అని పేర్కొన్నాడు. అలాగే చారిత్రాత్మక టెస్టు ఆట, పాటలు, సత్కారల నడుమ జరుతుందని చెప్పాడు. మ్యాచ్‌ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంట మోగించి ప్రారంభిస్తారన్నాడు. ఆ తర్వాత టాస్‌కు ముందు భారత ఆర్మీకి చెందిన పారా ట్రూపర్లు గాల్లోకి ఎగిరి రెండు జట్ల సారథులకు గులాబీ బంతులను అందించనున్నారు. అలాగే మ్యాచ్ మధ్యలో టీ విరామంలో మైదానంలో బండ్లపై మాజీ కెప్టెన్ల ఊరేగింపు ఉంటుందన్నాడు. మ్యాచ్ ముగిసాక రునా లైలా, జీత్ గంగూలీ సంగీత ప్రదర్శలనతో అభిమానును అలరి స్తారని చెప్పాడు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూ ల్కర్, సునీల్ గావస్కర్, కపిల్‌దేవ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేతో పాటు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా స్టార్ షట్లర్ పీవీ సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, మహిళా బాక్సర్ మేరీ కోమ్ వంటి దిగ్గజాలు మ్యాచ్‌కు హాజరు కానున్నారు. ఆటగాళ్లందరినీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సత్కరించనుంది. అలాగే గంగూలీ, సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, కుంబ్లేలతో కలిసి క్యాబ్ 40 నిమిషాల చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 2001లో ఆస్ట్రేలియాపై ఈడెన్‌గార్డెన్‌న్స్ వేదికగా గెలిచిన చారిత్రాత్మక విజ యంపై వీరంతా చర్చించనున్నారు.

*చిత్రం... పిచ్‌ను పరిశీలిస్తున్న గంగూలీ