క్రీడాభూమి

సుశీల్ కేసులో తీర్పు నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున రెజ్లింగ్ పురుషుల 74 కిలోల విభాగంలో ఎవరు పోటీపడాలన్న విషయంపై సోమవారం స్పష్టత రానుంది. తనకే అవకాశం కల్పించాలని లేదా నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్‌ను నిర్వహించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో సుశీల్ కుమార్ వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన తర్వాత సుశీల్ ఎక్కువ శాతం ఈవెంట్స్‌కు గైర్హాజరయ్యాడు. అదే సమయంలో నర్సింగ్ వివిధ టోర్నీల్లో పాల్గొని భారత కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేశాడు. అంతేగాక, భారత్‌కు ఒలింపిక్స్‌లో అర్హతను సంపాదించిపెట్టాడు. అందుకే భారత ఒలింపిక్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) నర్సింగ్ పేరునే ఒలింపిక్స్‌కు ప్రతిపాదిస్తున్నది. అయితే, రెండు పర్యాయాలు ఒలింపిక్ పతకాలను సాధించిన ఏకైక భారతీయుడిగా రికార్డు నెలకొల్పిన తనకే అవకాశం దక్కాలని సుశీల్ వాదిస్తున్నాడు. ప్రధానికి, క్రీడా మంత్రికి లేఖలు రాశాడు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై కోర్టు సోమవారం తీర్పునివ్వనుంది. అయితే, ఇంతకు ముందే వాదోపవాదాల సమయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే, సుశీల్‌కు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదనే అనుకోవాలి.