క్రీడాభూమి

జన సంద్రమైన లూయిస్‌విల్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూయిస్‌విల్లే, జూన్ 5: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ మృతితో అతని స్వస్థలమైన లూయిస్‌విల్లే దిగ్బ్రాంతికి గురైంది. అభిమానులతో పోటెత్తిపోయింది. అలీ భౌతిక కాయాన్ని చివరిసారి దర్శించుకోవడానికి ప్రముఖల నుంచి సామాన్యుల వరకూ అందరూ క్యూ కట్టడంతో లూయిస్‌విల్లే జన సంద్రమైంది. సొంత తండ్రిని కోల్పోయినట్టు కొంత మంది విలపిస్తే, మత ప్రవక్త తమను విడిచి వెళ్లాడంటూ మరికొందరు రోదించారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా జన ప్రవాహం కొనసాగుతున్నది. అలీకి చిరకాల ప్రత్యర్థిగా ముద్రపడిన జార్జి ఫోర్మన్ కూడా అతని మృతికి సంతాపం వ్యక్తం చేశాడు. ఒక మంచి మిత్రుడిని, క్రూరమైన ప్రత్యర్థిని కోల్పోయానని వ్యాఖ్యానించాడు. ‘ఇంతకాలం మేమిద్దరం ఒకే శరీరమనే అనుకున్నాను. కానీ, అలీ మృతి చెందిన తర్వాత ఆ శరీరంలో కీలక భాగం అతనేనని స్పష్టమైంది’ అన్నాడు. అలీతో తనకు సుమారు 50 సంవత్సరాల పరిచయం, సాన్నిహిత్యం ఉందని చెప్పాడు. అతను ఇక లేడన్న వార్తను నమ్మలేకపోతున్నానని అన్నాడు. భౌతికంగా అలీ మన మధ్య లేకపోయినా, అతను ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని పేర్కొన్నాడు. పలువురు ప్రస్తుత, మాజీ బాక్సర్లు అలీ ఫైట్స్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.

అవయవాలన్నీ ఆగినా
కొట్టుకున్న గుండె!
బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ అవయవాలన్నీ పని చేయడం మానేసినప్పటికీ ఆయన గుండె మాత్రం అరగంట సేపు కొట్టుకుంటూనే ఉండిందని ఆయన కుమార్తె, ఫ్రీలాన్స్ రచయిత్రి అయిన హనా అలీ శనివారం ట్విట్టర్‌లో తెలిపింది. ఇంతకు ముందు ఎవరు కూడా ఇలాంటి ఘటనను చూడలేదని ఆమె పేర్కొంది. తన తండ్రి ఆత్మశక్తికి ఇదొక నిదర్శనమని తెలిపింది.