క్రీడాభూమి

ఏకాగ్రతే విజయ రహస్యం: ముగురుజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 5: ఏకాగ్రతతో మ్యాచ్ ఆడడం వల్లే శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో విజయం సాధ్యమైందని తొలిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధించిన స్పెయిన్ క్రీడాకారిణి గార్బినే ముగురుజా అన్నది. ట్రోఫీతో ఆదివారం ఫొటో షూట్‌కు హాజరైన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించడం సులభం కాదని వ్యాఖ్యానించింది. ఏమాత్రం ఒత్తిడికి గురైనా లేక దృష్టి మరల్చినా ఫలితం తనకు ప్రతికూలంగా ఉంటుందనేది తెలుసునని చెప్పింది. అందుకే, ఏకాగ్రత కోల్పోకుండా మ్యాచ్‌ని పూర్తి చేశానని తెలిపింది. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకొని, స్ట్ఫె గ్రాఫ్ రికార్డును సమం చేసే దిశగా ఫైనల్‌కు దూసుకొచ్చిన సెరెనాకు ముగురుజా బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. నిరుడు వింబుల్డన్ ఫైనల్ చేరిన ముగురుజా టైటిల్ పోరులో సెరెనా చేతిలో ఓటమిపాలైంది. ఆ పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది.
వేట కొనసాగుతుంది: సెరెనా
గ్రాండ్ శ్లామ్ టైటిల్ వేటను కొనసాగిస్తానని సెరెనా విలియమ్స్ స్పష్టం చేసింది. కెరీర్‌లో తొలిసారి వరుసగా రెండుసార్లు గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్‌లో ఓడిన సెరెనా విలేఖరులతో మాట్లాడుతూ, తన ప్రయత్నాలను నిలిపివేసే ప్రసక్తే లేదని చెప్పింది. ‘ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో ఆన్ కెర్బర్ మూడు సెట్లలో 16 పొరపాట్లు చేసింది. కానీ, చివరికి ఆమెకే టైటిల్ లభించింది. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ముగురుజా అసాధారణ స్థాయిలో చెలరేగింది. ఆమె ఆట ప్రశంసనీయం’ అన్నది. ఈ ఓటమితో నిరుత్సాహ పడడం లేదని, ఆటపై ఆసక్తి ఉన్నంత కాలం కెరీర్‌ను కొనసాగిస్తానని తెలిపింది.