క్రీడాభూమి

వెస్టర్న్ ఆస్ట్రేలియాదే కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్స్, నవంబర్ 26: డొమెస్టిక్ వనే్డ కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్‌లో క్వీన్స్‌లాండ్ జట్టుపై వెస్టర్న్ ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన క్వీన్స్‌లాండ్ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ జిమీ పెయర్సన్ (79) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా బౌలర్లలో జెరిచర్డ్‌న్, నాథన్ కౌల్టర్ నైల్ మూడేసి వికెట్లు తీసుకోగా, మార్కస్ స్టొయనిస్, ఆస్టన్ అగర్, డీఆ ర్సీ షార్ట్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే వెస్టర్న్ ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. షాన్ మార్ష్ (101, నాటౌట్) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

*చిత్రం.. ట్రోఫీతో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు