క్రీడాభూమి

జోఫ్రాకు న్యూజిలాండ్ బోర్డు క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, నవంబర్ 26: న్యూజి లాండ్ గడ్డపై జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చేదు అనుభవం ఎదురైంది. స్కోర్ బోర్డు వద్ద ఓ ప్రేక్షకుడు జోఫ్రా పై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశాడు. దీంతో జోఫ్రా విషయాన్ని తమ క్రికెట్ బోర్డుకు తెలియజేయడం తో విషయం బయటికి వచ్చింది. దీనిపై స్పందించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జోఫ్రాకు బహిరంగ క్షమాప ణలు చెప్పింది. తమ దేశంలో జాతి విద్వేషానికి తావు లేదని, అలాంటి వారిని క్షమించేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయం ఆల స్యంగా తెలుసుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం జోఫ్రా కు దేశం, జట్టు తరఫున క్షమాపణలు కోరాడు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, మళ్లీ పునరావృతం కాకుండా మైదాన సిబ్బంది చూసుకో వాలని కోరాడు. అయతే ఈ ఘటనను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పోలీసుల కు అప్పగించడం విశేషం.