క్రీడాభూమి

మూడు పాయింట్ల దూరంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ: బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్ అనంతరం మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకులను విడుదల చేసింది. ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 25 పాయింట్లు మెరుగు పర్చుకొని 928 రేటింగ్ పాయంట్లతో మొదటి స్థానానికి 3 పాయంట్ల దూరంలో నిలిచి, రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక మొదటి స్థానంలో 931 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నిలిచాడు. 877 రేటింగ్ పాయంట్లతో ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉండగా, భారత్‌కే చెందిన చటేశ్వర్ పుజారా 791, అజింక్యా రహానే 759 రేటింగ్ పాయింట్లతో వరుసగా 4,5 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న యువ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న బెన్ స్టోక్స్ మూడు స్థానాలు మెరుగు పరుచుకొని తొలిసారిగా టాప్ టెన్‌లో స్థానం సంపాదించాడు.
పడిపోయన బుమ్రా ర్యాంకు..
ఇటీవల స్వల్ప గాయంతో టెస్టు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ర్యాంకు పడిపోయంది. తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో బుమ్రా ఒక స్థానం దిగజారి 794 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని 772 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ 907 రేటింగ్ పాయంట్లతో అగ్రస్థానాన్ని నిల బెట్టుకున్నాడు.
రెండో స్థానంలో జడేజా..
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. తాజా ర్యాంకింగ్స్‌లో ర వీం ద్ర జడేజా 406 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం దిగజారి 308 రేటిం గ్ పాయంట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 472 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ 401 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.
*చిత్రం..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ