క్రీడాభూమి

ఇండోనేషియా బాడ్మింటన్ విజేత చాంగ్ వెయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూన్ 5: ఇండోనేషియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను మలేసియా ఆటగాడు లీ చాంగ్ వెయ్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను డెన్మార్క్ క్రీడాకారుడు జాన్ జొర్గెనె్సన్‌ను 17-21, 21-19, 21-17 తేడాతో ఓడించాడు. ఈ ఏడాది అతనికి ఇది నాలుగో టైటిల్. కాగా, మహిళల సింగిల్స్‌లో తాయ్ జూ ఇంగ్ టైటిల్‌ను సాధించింది. ఆమె ఫైనల్‌లో వాంగ్ ఇహాన్‌ను 21-17, 21-8 ఆధిక్యంతో వరుస సెట్లలో చిత్తుచేసింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను లీ యంగ్ డయే, ఇయాన్ సియాంగ్ జోడీ గెల్చుకుంది. వీరు ఫైనల్‌లో చాయ్ బియావో, సాంగ్ వెయ్ జోడీని ఫైనల్‌లో 13-21, 21-13, 21-16 తేడాతో ఓడించారు. మహిళల డబుల్స్‌లో జపాన్‌కు చెందిన మిసాకీ మత్సుమొతో, ఆయాకా తకహషి టైటిల్ అందుకున్నారు. ఫైనల్‌లో వీరు యూ యాంగ్, తాంగ్ యువాంటింగ్ జోడీని 21-15, 8-21, 21-15 తేడాతో ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో చైనాకు చెందిన మా జిన్, జూ చెన్ జోడీ 21-15, 16-21, 21-13 స్కోరుతో కిమ్ హనా, కో సంగ్ హ్యున్ జోడీపై గెలిచి టైటిల్ అందుకుంది.