క్రీడాభూమి

ఫిట్నెస్‌పై శ్రద్ధ పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ క్రీడాకారులను తయారు చేసే విధంగా ప్రయత్నం జరుగుతోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. అందులో భాగంగానే అన్ని పాఠశాలలు ప్రత్యేకించి కేంద్రీయ విద్యాలయాలు పిల్లల శారీర దారుఢ్యంపై శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. కేంద్రీయ విద్యాలయాలన్నీ ఫిట్నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రోగ్రెస్ కార్డుల్లో మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఫిట్నెస్‌కు కూడా మార్కులు వేయాలని ఆయన అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఇటీవల ప్రకటించిన ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్రీయ విద్యాలయాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పిల్లలు ఫిట్నెస్‌గా ఉంటేనే భవిష్యత్తు ఉజ్వలమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. క్రీడారంగంలో భారత్ మరింత ఉన్నత స్థానాన్ని దక్కించుకోవాలంటే పాఠశాల స్థాయి నుంచే ఫిట్నెస్‌పై శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు.