క్రీడాభూమి

హెచ్‌సీఏ అధ్యక్ష హోదాలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత్-వెస్టిండీస్‌ల తొలి టీ20 ముంబైలో డిసెంబర్ 6వ తేదీన జరాగాల్సి ఉండగా, ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్‌ను హైదారాబాద్ నగరంలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గుచూపింది. దీంతో వచ్చే నెలలో వెస్టిండీస్‌తో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంథీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను ముందుగా 6వ తేదీన నిర్వహిస్తున్నామని గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. హెచ్‌సీఏ అధ్యక్ష హోదాలో జరుగతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ అని, మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందకు కృషి చేస్తామన్నారు. క్రికెట్ అనేది ప్రతిరోజు నేర్చుకునే గేమ్, మ్యాచ్ తిలకించేందుకు వచ్చే అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, గురువారం నుంచి మ్యాచ్ టికెట్లు, ఈవెంట్స్ నౌడార్ట్‌కామ్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని అజారుద్దీన్ తెలిపారు. ఇటీవల హెచ్‌సీఏపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడుపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమెనట్లు తెలు స్తోంది. ఇదే విషయమై అజారుద్దీన్ వద్ద ప్రస్తా వించగా, రాయుడు ఆరోపణల గురించి మా ట్లాడొద్దని ముందుగానే విలేఖరులకు సూచించారు. ఈ క్రమంలో సీఈఓ నివేదిక అనంతరం రాయుడిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమాచారం. మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులకు ఏలాంటి ఇబ్బందులు కలుగాకుండా సకల ఏర్పాట్లు చేయడం జరుగతుందన్నారు. మ్యాచ్‌కు పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సికింద్రాబాద్ జింఖానా మైదానంలోని హెచ్ సీఏ కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వర కు పొందవచ్చని హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. విజయానంద్ తెలిపారు.

*చిత్రం...మహ్మద్ అజహరుద్దీన్