క్రీడాభూమి

న్యూజిలాండ్ 375 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, నవంబర్ 30: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 375 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ 173/3 తో రెండో రోజు శనివారం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆది లోనే షాక్ తగిలింది. తొలిరోజు సెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న ఓపెనర్ టామ్ లాథమ్ (105) మరో నాలు గు పరుగులు మాత్రమే జోడించి బ్రాడ్ బౌలింగ్‌లో బౌల్డ య్యాడు. అనంతం కొద్దిసేపటికే హెన్రీ నికోల్స్ (16) కూడా అవుట్ కావడంతో న్యూజిలాండ్ 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయంది. ఆ తర్వాత బీజే వాట్లింగ్ (55), డరియల్ మిచెల్ (73) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు 124 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. వీరు పెవిలియన్‌కు చేరిన కొద్దిసేపటికే టిమ్ సౌథీ (18), మిచెల్ శాంతర్న్ (23), నైల్ వాగ్నర్ (0) కూడా అవుట్ కావడంతో కివీస్ 375 పరుగులకు ఆలౌటైంది. మాట్ హెన్రీ (5) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 4 వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్ 3, సామ్ కుర్రాన్ 2, జోఫ్రా ఆ ర్చర్ 1 వికెట్ పడగొట్టారు.
ఆదిలోనే షాక్..
అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డొమినిక్ సిబ్లే (4), జో డెన్లీ (4) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయ 39 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (24), కెప్టెన్ జో రూట్ (6) క్రీజులో ఉన్నారు.
స్కోర్ బోర్డు..
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: జీత్ రావల్ (సీ) రూట్ (బీ) బ్రాడ్ 5, టామ్ లాథమ్ (బీ) బ్రాడ్ 105, కేన్ విలియమ్సన్ (సీ) రూట్ (బీ) క్రిస్ వోక్స్ 4, రాస్ టేలర్ (సీ) రూట్ (బీ) క్రిస్ వోక్స్ 53, హెన్రీ నికోల్స్ (సీ) బ్రాడ్ (బీ) సామ్ కుర్రాన్ 16, బీజే వాట్లింగ్ (సీ) రోరీ బర్న్స్ (బీ) బ్రాడ్ 55, డరియల్ మిచెల్ (సీ) జోఫ్రా ఆర్చర్ (బీ) బ్రాడ్ 73, మిచెల్ శాంత్నర్ (సీ) క్రిస్ వోక్స్ (బీ) జోఫ్రా ఆర్చర్ 23, టిమ్ సౌథీ (సీ) ఓలీ పోప్ (బీ) క్రిస్ వోక్స్ 18, మాట్ హెన్రీ (నాటౌట్) 5, నైల్ వాగ్నర్ (సీ) సిబ్లే (బీ) సామ్ కుర్రాన్ 0.
ఎక్స్‌ట్రాలు: 18, మొత్తం: 375 (129.1 ఓవర్లలో 3 ఆలౌట్)
బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 28-7-73-4, జొఫ్రా ఆర్చర్ 28-3-75-1, క్రిస్ వోక్స్ 31-6-83-3, సామ్ కుర్రాన్ 23.1-7-63-2, జో రూట్ 3-0-14-0, బెన్ స్టోక్స్ 13-5-36-0, జో డెన్లీ 3-0-13-0.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: రోరీ బర్న్స్ (బ్యాటింగ్) 24, డొమినిక్ సిబ్లే (ఎల్బీడబ్ల్యూ) (బీ) సౌథీ 4, జో డెన్లీ (సీ) వాట్లింగ్ (బీ) మాట్ హెన్రీ 4, జో రూట్ (బ్యాటింగ్) 6.
ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 39 (18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-11, 2-24
బౌలింగ్: టిమ్ సౌథీ 8-1-24-1, మాట్ హెన్రీ 7-3-10-1, నైల్ వాగ్నర్ 2-0-3-0, డరియల్ మిచెల్ 1-0-1-0.