క్రీడాభూమి

దేశవాళీ క్రికెట్ పోటీల నిర్వహణ ఫీజులు పెంపునకు సుముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 2: దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ ఫీజులను పెంచేందుకు సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఫీజులను పెంచాల్సిందిగా రాష్ట్ర అసోసియేషన్లు చేసిన విజ్ఞప్తి మేరకు 88వ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ ఫీజులు మ్యాచ్‌ల్లో ఆటలు జరిగే రోజుకు, జరగని రోజుకు సైతం వర్తించనున్నాయి. అలాగే 60 ఏళ్ల వయసు దాటిన 17 మంది స్కోరర్లను నిర్భంద ఉద్యోగ విరమణ చేయించే విషయంపై కూడా ఈదఫా బోర్డు సమావేశంలో తుది నిర్ణయం జరుగుతుందని తెలిసింది. ఈ అంశాన్ని గడచిన ఆదివారం ముంబయిలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో కొంతమంది సభ్యులు ప్రస్తావించడం జరిగింది.
ప్రస్తుతం దేశవాళీ మ్యాచ్ జరిగే రోజులకు మాత్రం రోజుకు రూ. ఒక లక్ష వంతున టోకెన్ అవౌంట్‌గా చెల్లిస్తోంది. ఐతే ఆట జరగని రోజుల్లో ప్రయాణ చార్జీలు, ఇతరత్రా జట్టు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని అందుకే తాము ఈ ఫీజులు పెంచాలని కోరామని సంబంధిత సభ్యుడొకరు తెలిపారు.