క్రీడాభూమి

వార్నర్ అర్ధ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోవి డెన్స్ (గయానా), జూన్ 6: ముక్కోణపు వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెల్చుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అజేయ అర్ధ శతకంతో రాణించి ఆసీస్‌ను విజయపథంలో నడిపాడు. అతని విజృంభణతో, 117 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 25.4 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 32.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. జాన్ జార్లెస్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కార్లొస్ బ్రాత్‌వెయిట్ 21 పరుగుల సాధించాడు. డారెన్ బ్రేవో 19 పరుగులకు అవుటయ్యాడు. మిగతా వారు ఈ మాత్రం స్కోరు కూడా చేయకుండా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో విండీస్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. నాథన్ లియాన్ 39 పరుగులకు మూడు పరుగులు సాధిస్తే, ఆడం జంపా కేవలం 16 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మిచెల్ స్టార్క్‌కు రెండువికెట్లు లభించాయి. ఆసీస్ బౌలింగ్‌ను విండీస్ బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఒకరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో మరో 17.3 ఓవర్లు మిగిలి ఉండగానే విండీస్ ఆలౌటైంది.
అత్యంత సాధారణమై లక్ష్యాన్ని అందుకోవడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 44 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ (19) బౌలింగ్‌లో తొలి వికెట్‌ను కోల్పోయింది. అతను జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. ఉస్మాన్ ఖాజా 27 పరుగులు చేసి, సులేమాన్ బెన్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కు చిక్కాడు. స్టీవెన్ స్మిత్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక కేవలం 6 పరుగులు చేసి సునీల్ నారైన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. ఆదే ఓవర్‌లో మరో రెండు బంతులకే గ్లేన్ మాక్స్‌వెల్ (0)ను నారైర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, అప్పటికే స్కోరు 92 పరుగులకు చేరడంతో ఆస్ట్రేలియా ఎలాంటి ఒత్తిడి లేకుండా మిగతా పరుగులను రాబట్టుకోగలిగింది. మరో 24.2 ఓవర్లు మిగిలి ఉండగా, 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని సాధించే సమయానికి వార్నర్ 55, మిచెల్ మార్ష్ 9 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 32.3 ఓవర్లలో 116 ఆలౌట్ (జాన్ చార్లెస్ 22, డారెన్ బ్రేవో 19, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 21, మిచెల్ స్టార్క్ 2/37, నాథన్ లియాన్ 3/39, ఆడం జంపా 3/16.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 25.4 ఓవర్లలో 4 వికెట్లకు 117 (డేవిడ్ వార్నర్ 55 నాటౌట్, ఉస్మాన్ ఖాజా 27, ఫించ్ 19, సునీల్ నారైన్ 2/36).