క్రీడాభూమి

బుమ్రా ప్రాక్టీస్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: గాయం నుంచి కోలుకున్న భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇక్కడి ఎంసీఏలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో గాయపడిన కారణంగా అతను స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌ల్లో ఆడలేకపోయాడు. అదే విధంగా ఈనెల 6 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా దూరంగా ఉంటాడు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై దృష్టి పెట్టిన అతను ప్రాక్టీస్ ప్రారంభించాడు. దాని తర్వాత, వచ్చే ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి, ఐదు టీ-20, మూడు వనే్డ, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడే టీమిండియాలో స్థానం కోసం పోటీపడతాడు.