క్రీడాభూమి

టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ‘టాప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ నెంబర్-1 స్థానాన్ని ఆక్రమించాడు. గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న కోహ్లీ మొత్తం 928 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 923, న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్‌సన్ 877 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాలు సొంతం చేసుకున్నారు. టాప్ టెన్‌లో భారత ఆటగాళ్ళు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఉన్నారు. కాగా బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), కాగిసో రబధా (దక్షిణాఫ్రికా), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) మొదటి మూడు స్థానాలను సంపాదించారు. ఈ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ కూడా టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్నారు. జాసన్ హోల్డర్ నెంబర్-1గా ఉన్న అల్‌రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా రెండో స్థానంలో నిలిచాడు. టాప్ టెన్‌లో అశ్విన్ కూడా ఉండడం గమనార్హం. ఇలాఉంటే భారత జట్టు టీం ర్యాంకింగ్స్‌లో నెంబర్-1 స్థానంలో కొనసాగుతున్నది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
టెస్టు ర్యాంకింగ్స్ ‘టాప్-10’
బ్యాటింగ్ విభాగం
1. విరాట్ కోహ్లీ ( భారత్/ 928 పాయింట్లు), 2. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా/ 923), 3. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 877), 4. చటేశ్వర్ పుజారా ( భారత్/ 791), 5. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 764), 6. అజింక్య రహానే ( భారత్/ 759), 7. జో రూట్ (ఇంగ్లాండ్/ 752), 8. మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా/ 731), 9. హెన్రీ నికోల్స్ (న్యూజిలాండ్/ 726), 10. దిముత్ కరుణరత్నే (శ్రీలంక/ 723 పాయింట్లు).
బౌలింగ్ విభాగం
1. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా/ 900 పాయింట్లు), 2. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా/ 839), 3. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్/ 830), 4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్/ 814), 5. జస్‌ప్రీత్ బుమ్రా ( భారత్/ 794), 6. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా/ 783), 7. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్/ 782), 8. జొస్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా/ 776), 9. రవిచంద్రన్ అశ్విన్ ( భారత్/ 772), 10. మహమ్మద్ షమీ ( భారత్/ 771).
ఆల్‌రౌండర్ల విభాగం
1. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్/ 473 పాయింట్లు), 2. రవీంద్ర జడేజా (్భరత్/ 406), 3. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్/ 381), 4. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా/ 315), 5. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్/ 308), 6. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ 284), 7. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా/ 278), 8. రోస్టన్ ఛేజ్ (వెస్టిండీస్/ 238), 9. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (న్యూజిలాండ్/ 237), 10. క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్/ 227).
‘టాప్-10’ జట్లు
1. భారత్ (120 పాయింట్లు), 2. న్యూజిలాండ్ (109), 3. ఇంగ్లాండ్ (104), 4. దక్షిణాఫ్రికా (102), 5. ఆస్ట్రేలియా (102), 6. శ్రీలంక (95), 7. వెస్టిండీస్ (81), 8. పాకిస్తాన్ (80), 9. బంగ్లాదేశ్ (60), 10. అఫ్గానిస్తాన్ (49)

*చిత్రం... ప్రాక్టీస్ సెషన్‌కు హాజరవుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ