క్రీడాభూమి

కరుణరత్నే అర్ధ సెంచరీ ; శ్రీలంక 202/5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావల్పిండి, డిసెంబర్ 11: పాకిస్తాన్ జట్టుతో జరుగు తున్న మొదటి టెస్టులో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్లు ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 96 పరుగుల భాగస్వా మ్యాన్ని అందించారు. ఈ దశలో అర్ధ సెంచరీ పూర్తి చేసు కున్న కెప్టెన్ దిముత్ కరుణరత్నే (59) షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో ఎల్‌బీగా అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేప టికే మరో ఓపెనర్ ఒషాడ ఫెర్నాండో (40), కుశల్ మెండిస్ (10), దినేష్ చండీమాల్ (2) కూడా వెనువెంటనే పెవిలియ న్‌కు చేరారు. ఈ క్రమంలో అంజిలో మాథ్యూస్ (31) ఫర్వాలేదనిపించాడు. మొదటిరోజు ఆట ముగిసే సమయా నికి శ్రీలంక జట్టు 5 వికెట్లను కోల్పోయ 202 పరుగులు చేసింది. క్రీజులో ధనుంజయ డీసిల్వా (38), వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా (11) ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీం షా 2 వికెట్లు పడగొట్టగా, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రీది, ఉస్మాన్ షిన్వారికి తలో వికెట్ దక్కింది.త

*చిత్రం... హై సెక్యూరిటీ మధ్య మైదానానికి వెళ్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు